తెలంగాణ

డిటెన్షన్ లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: డిటెన్షన్ విధానంతో బాధపడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు కోఠీ ఏరియాలో టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు. గత రెండు నెలలుగా డిటెన్షన్ వివాదం రాజుకుంటోంది. డిటెన్షన్ నిబంధనలకు ఎక్కువ శాతం విద్యార్థులు ఫెయిల్ కావడం, పదే పదే పరీక్షలు రాయాల్సి రావడంతో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఎక్కువ కాలేజీలు జెఎన్‌టియుహెచ్‌కు అనుబంధం కాగా, మరికొన్ని ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీకి, కొన్ని ఉస్మానియాకు, కాకతీయ వర్శిటీకి, నల్గొండ వర్శిటీకి అనుబంధంగా ఉన్నాయి. ఒక్కో యూనివర్శిటీలో ఒక్కో రీతిన డిటెన్షన్ విధానాన్ని అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో డిటెన్షన్ విధానానే్న ఎత్తివేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇంజనీరింగ్ మధ్యలో డిటైన్ చేయడం వల్ల ఒక సంవత్సరం పాటు ఇంట్లో కూర్చోవల్సి వస్తోందని దీంతో ప్రభుత్వం నుండి రావల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆగిపోతోందని విద్యార్థులు ఆవేదనగా చెబుతున్నారు. రెగ్యులర్ పరీక్షలు ముగిసిన వెంటనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని, జెఎన్‌టియు పరిధిలో దాదాపు 15వేల మంది వరకూ ప్రతి ఏటా డిటైన్ అవుతున్నారని,విద్యార్థులు ఆవేదనగా చెబుతున్నారు. సమస్య పరిష్కరించమని విద్యార్థులు వర్శిటీ చుట్టూ 50 రోజులుగా తిరుగుతున్నా అధికారగణం మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.
ఉస్మానియా రాయితీలు
డిటెన్షన్ విధానంతో విద్యార్థులు ఎక్కువగా నష్టపోకుండా కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్టు ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ సీ రామచంద్రం శుక్రవారం నాడు చెప్పారు. కనీసం 50 శాతం క్రెడిట్స్ పొందినవారిని ఇక మీదట ప్రమోట్ చేస్తామని, అంతకంటే ఎక్కువ శాతం ఫెయిల్ అయిన వారిని మాత్రమే డిటైన్ చేస్తామని ఆయన వివరించారు. ప్రతి సెమిస్టర్ లేదా సంవత్సరంలో 9 క్రేడిట్స్ మినహాయింపు కూడా ఉంటుందని అన్నారు. అంటే ప్రతి ఏటా 12 సబ్జెక్టులు పెండింగ్‌లో ఉంటే రెగ్యులర్ కోర్సులోని సబ్జెక్టులు కలిపి 20 సబ్జెక్టులు రాయాల్సి ఉంటుందని, అది విద్యార్థులకు ఎడతెగని భారం అవుతుందని ఆయన చెప్పారు. ఇంతకు మించి ఎక్కువ సబ్జెక్టులకు మినహాయింపు ఇస్తే విద్యార్థులకే పెద్ద భారం అవుతుందని దానిని అంతా అర్ధం చేసుకోవాలని చెప్పారు. యూనివర్శిటీ ఇప్పటికే అగ్రగామిగా ఉందని, రానున్న రోజుల్లో డిటెన్షన్ విధానంలో మరింత సడలిస్తే యూనివర్శిటీ పరువు కూడా పోయే ప్రమాదం ఉంటుందని బోధన సిబ్బంది చెబుతున్నారు. అయితే డిటెన్షన్ విధానంపై జెఎన్‌టియు అధికారులు మాత్రం వౌనంగా ఉండటంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి సీబీసీఎస్ విధానంలో 18,947 మంది పరీక్షలకు హాజరుకాగా, 8.4 శాతం మంది డిటైన్ అయ్యారు. ఫస్టియర్‌లో రెండు శాతం, సెకండియర్‌లో 13 శాతం, ఫైనల్ ఇయర్‌లో 8 శాతం మంది డిటైన్ అయ్యారు.