తెలంగాణ

ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలీస్ బందోబస్తు, తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ శుక్రవారం ఇక్కడ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఎన్నికల కోడ్‌ను తూ.చ తప్పకుండా పాటించడానికి చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కోసం హెలీకాప్టర్‌ను వినియోగించడానికి ఈసీ అనుమతి ఇస్తుందని ఆయన చెప్పారు. పోలింగ్ స్టేషన్ల వారీగా మ్యాప్‌ను సూచించాలని, అందుకు అవసరమైన బలగాలను పంపడానికి పక్కా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. పోలింగ్ సిబ్బందిని తరలించే వాహనాలను వినియోగించడానికి అనుమతులు తీసుకోవాలని చెప్పారు. బందోబస్తుకు శిక్షణ పొందిని పోలీస్ బలగాలను సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈవీఎంలు పనితీరుపై ఓటర్లలో అవగాహన తేవాలన్నారు.