తెలంగాణ

రాజధానికి చేరిన ఖమ్మం అసమ్మతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో తెరాస అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అసమ్మతి నేతలందరినీ రాజధానికి వచ్చి కలవాల్సిందిగా అధిష్ఠానం ఆదేశించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు మినహా మిగిలిన ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో వారు సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. వైరాలో ఇటీవల భారీ బహిరంగ సభ కూడా నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఇది మరింత ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో అసమ్మతి నేతలను రాజధానికి వచ్చి కలవాల్సిందిగా అధినేతలు ఆదేశించారు. ఇటీవల సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన అసమ్మతి నేత మట్టా దయానంద్‌ను మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు వద్దకు తీసుకెళ్లి బుజ్జగించారు. అక్కడి అభ్యర్థి పిడమర్తి రవితో కలిసి పనిచేయాలని, దయానంద్‌కు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇదే క్రమంలో పార్టీ అభ్యర్థితో కలిసి ప్రచారానికి దూరంగా ఉంటున్న మధిర నియోజకవర్గ నేతలు, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వైరా నేతలు, ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న కొత్తగూడెం, అశ్వారావుపేట నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు కూడా అసమ్మతి నేతలతో ప్రత్యేకంగా మాట్లాడుతూ వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అధిక స్థానాల్లో విజయం సాధించాలని, తద్వారా జిల్లా నేతలకు ప్రభుత్వంలో అనేక పదవులు వచ్చే అవకాశం ఉందని, వాటిలో నేతలకు ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేస్తున్నారు. సోమవారం మధిర, వైరా నియోజకవర్గాలకు చెందిన నేతలు రాజధానికి వెళ్లనున్నట్లు సమాచారం.