తెలంగాణ

ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఎఐ/ఎంఎల్ టాలెంట్ స్ప్రింట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: ఇంజనీరింగ్ కళాశాలలు భవిష్యత్తు ఉద్యోగాల కోసం తమ విద్యార్థులను సిద్ధం చేసుకోవడానికి వీలుగా ఎఐ/ఎంఎలమ్ ప్రొగ్రామ్‌ను టాలెంట్ స్ప్రింట్ ప్రకటించింది. విద్యారంగం, పరిశ్రమలు పరస్పర సహకారంతో భవిష్యత్తు కోసం కాన్‌ఫ్లూయన్స్ మూడవ ఎడిషన్ పేరిట ‘టాలెంట్ స్ప్రింట్’ అధ్వర్యంలో నగరంలో ఒక కార్యక్రమం జరిగింది. ‘ఎక్స్‌ట్రీమి ఆటోమెషన్ - గెట్ రెడీ ఫర్ ది న్యూ నార్మల్’ (గరిష్టానికి చేరుకున్న ఆటోమేషన్-మార్పుకు సిద్ధపడండి) నేపథ్యంతో జరిగిన ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఉన్న కళాశాలలకు చెందిన సీనియర్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు పాల్గొని ఆటోమేషన్‌కు సంబంధించిన లోతైన సాంకేతిక (డీప్-టెక్)ను తెలుసుకుంటూ ఐటీ పరిశ్రమ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేసుకునే కళాశాలలు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. టాలెంట్ స్ప్రింట్ సిఇవో, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శంతను పాల్ మాట్లాడుతూ పూర్తిగా ఆటోమేషన్‌కు మారిపోయిన ప్రస్తుత తరుణంలో అదనపు నైపుణ్య విలువలు పెరిగిపోతున్నాయని, అదనపు అనుభవ విలువలు తగ్గిపోతున్నాయని అన్నారు. ఇంకా టాలెంట్ స్ప్రింట్ చీఫ్ బిజినెస్ అధికారి కె. శ్రీ్ధర్ తదితరులు ప్రసంగించారు.