తెలంగాణ

దసరా తర్వాత టీఆర్‌ఎస్ మేనిఫెస్టో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: ఎన్నికలు తమ ప్రభుత్వానికి రెఫరెండం వంటివని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ ఆపద్ధర్మ మంత్రి కే. తారక రామారావు అన్నారు. దసరా పండుగ తర్వాత తమ పార్టీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)ను ప్రకటిస్తామని ఆయన శనివారం తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. ఏకకాలంలో రుణ మాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. నిరుద్యోగ భృతి ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తున్నామని అన్నారు. రేవంత్ రెడ్డి, సీఎం రమేష్, బీద మస్తాన్ రావులపై ఐటీ దాడులు జరిగితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ నాయకులపై ఐటీ దాడులు జరిగితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు స్పందించలేదన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ ఎప్పుడూ ఎన్నికలను ఎదుర్కొలేదు కాబట్టి ఆయన బలమెంతో తెలియదని కేటీఆర్ అన్నారు. అభ్యర్థులపై కొంత వ్యతిరేకత ఉండడం సహజమని, తనపైనా ఉంటుందన్నారు.