తెలంగాణ

పాతబస్తీలో ఎన్నికల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: పాతబస్తీలోని అనేక నియోజకవర్గాల్లో పట్టు సాధించిన మజ్లిస్‌కి ఈసారి చెక్ పెట్టాలనే నేపంతో వివిధ పార్టీలు ఏకమవుతున్నాయి. పాతబస్తీలో గట్టిపట్టున్న మజ్లిస్‌ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గత గొనే్నళ్లుగా మహ్మద్ అమానుల్లా ఖాన్ అన్నివర్గాల ప్రజల ఓట్లతో విజయం సాధించి మేటి నేతగా మన్ననలు పొందారు. మజ్లిస్‌కు దూరమైన అమానుల్లా ఖాన్.. ఎంబీటీని స్థాపించి అభ్యర్థిగా విజయం సాధించారు. కొన్ని సంవత్సరాల నుంచి ఎంబీటీకి ఇక్కడ మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో అమానుల్లా ఖాన్ కుమారుడికి మజ్లిస్ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీల మధ్య గట్టి పోటీ జరిగింది. 2014లో అక్బరుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఐదోసారి గెలవాలని నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మజ్లిస్ అభ్యర్థిని ఓడించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మజ్లిస్‌ని ఎదుర్కొనేందుకు ఎంబీటీని కాంగ్రెస్ రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఏఐఎంఐఎంకు గట్టి పోటీనిచ్చి పాతబస్తీలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ ప్రత్యేక దృషి సారించినట్టు తెలుస్తోంది. పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలకు సంబందించిన సీట్లపై కాంగ్రెస్ ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఈ స్థానాల్లో మజ్లిస్‌కు పోటీగా కాంగ్రెస్, ఎంబీటీ ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా చాంద్రాయణగుట్టలో మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీపై మహ్మద్ పాహిల్వాన్ లేదా అతని కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాతబస్తీ భారాన్ని ఎంబీటీకే వదిలేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. పాతబస్తీలో మజ్లిస్ ప్రత్యర్థిగా భావించే బీజేపీ.. ఇక్కడ నుంచి ఏబీవీపీ జాతీయ సభ్యురాలైన షేహజాదీని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. చాంద్రాయణగుట్టలో మజ్లిస్ అభ్యర్థి గెలువడం సులువు కాదని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి బరీలోకి దిగిన మహ్మద్ అమానుల్లా ఖాన్ 1978, 1983, 1985లో స్వతంత్య్ర అభ్యర్థిగా 1989లో మజ్లిస్ అభ్యర్థిగా గెలుపొందాడు. మజ్లిస్‌కు దూరైన అమానుల్లా ఖాన్ తిరిగి స్వాతంత్య్ర అభ్యర్థిగా 1994లో విజయం సాధించి నియోజకవర్గం ప్రజల్లో తిరుగులేని ముద్ర వేసుకున్నారు. మజ్లిస్ అభ్యర్థిగా అక్బరుద్దీన్ ఓవైసీ 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు విజయం సాధించారు.