తెలంగాణ

హైకోర్టునే తప్పుదారి పట్టించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలియజేసిన అంశాలలో చాలా తప్పులున్నాయని, హైకోర్టును తప్పు దారి పట్టించేలా ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు, పార్టీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల కమిషన్ చెప్పిన అంశాలను ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తీవ్రంగా తప్పుపట్టారు. సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పుడు కేసీఆర్ అప్పుడు ఒక మాట, ఇప్పుడు మరో మాటను ప్రభుత్వంతో చెప్పించడం విస్మయం కలిగించిందన్నారు. రెండు కోట్ల 73 లక్షల ఓటర్లు ఉన్నట్లు నివేదిక ఇచ్చారని, ఇంతకు ముందు ఓటర్ల జాబితా ప్రకారం అలా లేదన్నారు. ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఇష్టానుసారంగా చేర్పించారని, ఇష్టం లేని వారి ఓట్లను జాబితాను తొలగింపజేశారని ఆయన దుయ్యబట్టారు. ఇంటింటికీ వెళ్ళి ఓటర్ల నమోదు చేయలేదని ఆయన తెలిపారు. ఓటర్ల తుది జాబితాను అర్థరాత్రి విడుదల చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ పెట్టి దేశంలో గుణాత్మక మార్పులు తెస్తామంటున్న కేసీఆర్, ఇలా ఓటర్ల నమోదులో అవకతవకలు చేయడమే గుణాత్మక మార్పా? అని ఆయన ప్రశ్నించారు. అవతవకలపై తాము పోరాడుతున్నామని, ఈ నెల 31న కేసు విచారణకు రానున్నదని శశిధర్ రెడ్డి తెలిపారు. దేశ సమగ్రత కోసం యువత జాగృతం కావాలని, ఓటు హక్కును వినియోగించుకోవడానికి యువత తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.