తెలంగాణ

రేవంత్‌కి ఓటమి తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చిల్లరగావ్యవహరిస్తున్నారని ఆపద్దర్మ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తనపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ఈ పర్యాయం కొడంగల్ నియోజకవర్గం నుండి ఓడిపోతారన్నారు. ముషీరాబాద్‌లో తాను మీడియాతో మాట్లాడిన అంశాలపై రేవంత్‌రెడ్డి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాడని అన్నారు. కేసీఆర్ 5 లేదా 10 లక్షల రూపాయలు గత ఎన్నికల సందర్భంగా ఇస్తారని అనబోయి, 10 కోట్లు ఇస్తారని పొరపాటున అన్నానని నాయిని వివరించారు. గత ఎన్నికలకు సంబంధించి తాను మాట్లాడితే ఈ ఎన్నికలకు ముడిపెడుతున్నారన్నారు. కాంగ్రెస్-టీడీపీలను కలిపింది రేవంత్‌రెడ్డియేనని అన్నారు. రేవంత్ చర్యలతో కాంగ్రెస్ పార్టీకే నష్టమన్నారు. కేసీఆర్‌ను ఎంత తిడితే కాంగ్రెస్‌కు అన్ని ఓట్లు పోతాయన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ అడుగడుగునా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ చేసిన సర్వే ప్రకారం తమకు 100 సీట్లు వస్తాయని, జాతీయ ఛానెళ్ల సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. కాంగ్రెస్‌పార్టీలో చేరాల్సిన ఖర్మ తనకు లేదన్నారు. కేసీఆర్ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనడం సరికాదని, ఫోన్‌లో తాను తరచూ కేసీఆర్‌తో మాట్లాడుతూనే ఉన్నానని వివరించారు.