తెలంగాణ

ప్రజల జీవితాల్లో మార్పుతెచ్చే అజెండానే టీఆర్‌ఎస్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 14 : టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా ప్రత్యేక అజెండాతో ముందుకు రాబోతుందని స్పష్టం చేశారు. ఆసరా పింఛన్లు సైతం పెంచే యోధనలో సీఎం కేసీఆర్ ఉన్నారని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మైనార్టీల, ఎన్జీఓ కాలనీలో టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా జరిగిన ఆశీర్వాద సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఎస్సీలకు తీపి కబురు అందించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీలకు వెన్నుదన్నుగా ఉండే విధంగా మార్పు తీసుకొచ్చే విధంగా ప్రత్యేక అజెండాతో ముందుకు వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సర్కార్ సంక్షేమ రంగంలో దేశంలో నెంబర్‌వన్, 40వేల కోట్లతో సంక్షేమ ఫలాలు అందచేస్తున్నట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్య, వైద్యారంగానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఎస్సీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం 200 ఇంగ్లీష్ మీడియాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 30 కోట్లతో ఎస్సీ మహిళ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థుల కోసం 200 రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి హజ్ హౌస్ సిద్దిపేటలో 2 కోట్లతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో హజ్ హౌస్ నిర్మించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటకి 90 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే గోదవరి నీటితో ఈప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆసైన్డ్ భూముల్లో 58, 59 జీవోల పట్టా సర్ట్ఫికెట్లు ఇచ్చి వారిలో ఆత్మ విశ్వాసం నింపి, భూ తగాదాలను దూరం చేసినట్లు తెలిపారు. పేదల ఆరోగ్యంకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కార్పొరేట్ స్థాయిలో 500 పడకల ఆసుపత్రిని నిర్మించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో, హాస్టళ్లలో పేదపిల్లలకు సన్నబియ్యంతో భోజనం పేడుతున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయన్నారు. సిద్దిపేటలో దోమలు, ఈగలు లేని పట్టణంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. సిద్దిపేటను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. నియోజక వర్గంలోని అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు ప్రకటించటంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. భగవంతుడు శక్తి ఇచ్చిన మేరకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. ఆనంతరం మంత్రి హరీష్‌రావును వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, రాష్ట్ర మహిళ శిశుసంక్షేమ శాఖ ఆర్గనైజర్ బూర విజయ పాల్గొన్నారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు