తెలంగాణ

కేసీఆర్ ఓటమి ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగించి మిగులు బడ్జెట్ తెలంగాణను లక్షన్నర కోట్ల అప్పుల పాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ఓటమి ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్ధమైన రాజగోపాల్‌రెడ్డి సోమవారం నాంపల్లి మండలం వడ్డెపల్లి గ్రామం హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ శ్రేణులు, స్థానికులు రాజగోపాల్‌రెడ్డికి భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వడ్డెపల్లి, నేవెళ్లగూడెం, మహ్మదాపూరం, చిట్టెంపాడు, దామెర గ్రామాల్లో వందలాది మంది ఇతర పార్టీల నుండి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రోజంతా భారీ ర్యాలీలతో కొలహలంగా సాగిన రాజగోపాల్‌రెడ్డి ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. ప్రచార సభల్లో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి కేసీఆర్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను, అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అమలు చేయనున్న పథకాలను ప్రజలకు వివరించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా చేస్తానన్న కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారన్నారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలిస్తామని చెప్పి కేసీఆర్ నాలుగేళ్ల క్రితం మునుగోడు నియోజకవర్గంలోని డిండి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి నేటికి 10శాతం పనులు కూడా పూర్తి చేయలేదని, భూములు కోల్పోతున్న రైతులకు పరిహార పునరావాసాలు ఇవ్వలేదన్నారు. కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు చేస్తు రెండు రోజులకొకసారి కేసీఆర్, హరీష్‌రావులు పనులను సమీక్షిస్తు రాత్రింబవళ్లు పనులు జరిపిస్తున్నారని, డిండి ఎత్తిపోతల పనులను చూసేందుకు మాత్రం నాలుగేళ్లలో కేసీఆర్ ఒక్కసారికూడా రాలేదన్నారు. కాళేశ్వరం నిర్వాసితులకంటే తక్కువగా రైతులకు పరిహారం ఇస్తు మునుగోడు నియోజవర్గ రైతులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ముద్దు..డిండి వద్ధు అన్నట్లుగా వ్యవహారిస్తున్నారన్నారు. నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క రైతును పరామార్శించని కేసీఆర్ ఎన్నికల ముందు మరోసారి రైతుల ఓట్ల కోసం రైతుబంధు పథకం తెచ్చారన్నారు. పంటల మద్ధతు ధర పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు కంటే నాలుగింతల లాభం రైతులకు వచ్చేలా చేస్తుందన్నారు. రైతుబిడ్డగా తాను రైతుల సంక్షేమానికి ముందుంటానన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో విఫలమయ్యారన్నారు. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ నియంతృత్వంతో ఎమ్మెల్యేలు నామమాత్రంగా మారిపోగా వారికంటే కాంగ్రెస్ సర్పంచ్‌లే నయమన్నారు.
రానున్నది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమేనని జనరంజక పథకాలతో తమ మేనఫెస్టో ఉంటుందన్నారు. మునుగోడు నుండి తనను గెలిపిస్తే 60ఏళ్లలో చేయని అభివృద్ధిని ఐదేళ్లలో చేపడుతానని, డిండి ఎత్తిపోతల పూర్తి చేయించి ఫ్లోరైడ్ తాగునీరు, సాగునీటి సమస్యల సాధనకు కృషి చేస్తానన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు, ఆసరా పెన్షన్‌ను 2వేలు చేస్తామని, మెగా డిఎస్పీతో20వేల, లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నిమ్మల వెంకట్‌రెడ్డి, పూల వెంకటయ్య, ఎరెడ్ల సంజీవ్‌రెడ్డి, నక్క చంద్రశేఖర్ పాల్గొన్నారు.
చిత్రం..ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి