తెలంగాణ

ఆశావహుల్లో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 15: ఎన్నికల షెడ్యూల్ వెలువడి 10రోజులు కావస్తున్న సిద్దిపేట జిల్లాలో టీఆర్‌ఎస్ మినహా మిగత పార్టీ అభ్యర్థులు ఖరారు కాకపోవటంతో ఆశావాహుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సిద్దిపేట జిల్లా పరిధిలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజక వర్గాలున్నాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు అసెంబ్లీ రద్దు చేయటంతో పాటు 105 మంది అభ్యర్థులు ప్రకటించారు. జిల్లా పరిధిలో సిద్దిపేట నుండి హరీష్‌రావు, దుబ్బాక రామలింగారెడ్డి, హుస్నాబాద్ సతీష్‌కుమార్ అభ్యర్థులుగా ఖరారు చేసి, గజ్వేల్ నుండి కేసీఆర్ తాను స్వయంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా నుండి టీఆర్‌ఎస్ పార్టీకి అందర్ని సిట్టింగ్ అభ్యర్థులకే టికెట్లు కేటాయించారు. గత నెల సెప్టెంబర్ 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించి తొలి ప్రచార సభకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో సిద్దిపేట నుండి కేసీఆర్, దుబ్బాక నుండి రామలింగారెడ్డి, హుస్నాబాద్ నియోజక వర్గంలో సతీష్‌బాబులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గజ్వేల్ నియోజక వర్గం నుండి కేసీఆర్‌కు మద్దతుగా మంత్రి హరీష్‌రావు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు భూపతిరెడ్డి,నర్సారెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, డీసీసిబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డిలు ప్రచారం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో మంత్రి హరీష్‌రావుకు మద్దతుగా నియోజక వర్గంలోని 20 గ్రామాలు, పట్టణంలోని వివిధ కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, జడ్పీవైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీలు, కౌన్సిలర్లు టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ నియోజక వర్గంలో ఇప్పటికే 70కి పైగా గ్రామాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సతీష్‌బాబు ప్రచారం నిర్వహించారు. దుబ్బాక రామలింగారెడ్డి సైతం నియోజక వర్గం పరిధిలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు తమ ప్రత్యర్థి పార్టీల టికెట్ల ఖరారు కాకముందే తమ దైన శైలిలో ప్రచారంలో దూసుకపోతున్నారు.
ఖరారు కాని మహాకూటమి,
బీజేపీ అభ్యర్థులు
అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఏలాగైన ఓడించాలని లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ అభ్యర్థులు మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నారు. జిల్లా పరిధిలో మహాకూటమి పక్షాన హుస్నాబాద్ నియోజక వర్గాన్ని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రవీణ్‌రెడ్డి, బొమ్మ శ్రీరాం చక్రవర్తిలు ఆశీస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు టికెట్ తమకే వస్తుందనీ ధీమాతో ప్రచారం నిర్వహిస్తున్నారు. టికెట్ తమకే వస్తుందని సీపీఐ రాష్ట్ర నేత చాడ వెంకట్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ టికెట్‌ను సీపీఐకి కేటాయించని పక్షంలో మహాకూటమితో తాము జతకట్టెది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. గజ్వేల్ నుండి కాంగ్రెస్ పార్టీ పక్షాన పీసీసీ అధికార ప్రతినిధి వంటేరు ప్రతాప్‌రెడ్డి నియోజక వర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజక వర్గంలో అధికార పార్టీ, బీజేపీ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకొని టీఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గజ్వేల్ నియోజక వర్గంలో రాహుల్‌గాంధీ ప్రచారాన్ని నిర్వహించేందుకు సైతం సమాయత్తం అవుతున్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీనుండి దరిపల్లి చంద్రం, లక్కరసు ప్రభాకర్‌వర్మలు టికెట్ ఆశీస్తు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తు, ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. ఇరువురు టికెట్ తమకు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మాజీ మంత్రి ముత్యంరెడ్డి, పార్లమెంటరీ ఇన్‌చార్జి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, ఎంజేఆర్ ట్రస్టు అధినేత మద్దుల నాగేశ్వర్‌రెడ్డి ఆశీస్తు వివిధ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టికెట్‌పై ముగ్గురు నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ పక్షాన సిద్దిపేట నియోజక వర్గం నుండి జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తంరెడ్డి, రాష్ట్ర నేతలు విద్యాసాగర్, వంగ రాంచంద్రారెడ్డి,బీఎంఎస్ నేత కలాల్ శ్రీనివాస్ నేతలు ఆశీస్తున్నారు. ఇప్పటికే నరోత్తంరెడ్డి నియోజక వర్గంలో పలుగ్రామల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. టికెట్ తనకు వస్తుందని ధీమాతో గ్రామాల్లో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. దుబ్బాక నియోజక వర్గం నుండి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘనందర్‌రావు ఒక్కరే టీకెట్ ఆశీస్తుండటంతో దాదాపుగా ఖరారైనట్లు ప్రచారం జరుగుతుంది. హుస్నాబాద్ నియోజక వర్గం నుండి టికెట్ ఆశీస్తు శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. గజ్వేల్ నియోజ కవర్గంలో బీజేపీ టికెట్ కోసం ఆకుల రాజయ్య, శ్రీనివాస్‌రెడ్డిలు ఆశీస్తున్నారు. టీజేఎస్ పక్షాన దుబ్బాక అభ్యర్థిగా చిందం రాజ్‌కుమార్ పార్టీ అధినేత కోదండరామ్ గతంలో ప్రకటించారు. మహాకూటమి పక్షాన దుబ్బాక టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షుడు గుండు భూపేష్ సిద్దిపేట టికెట్‌ను ఆశీస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఒక వైపు ప్రచారంలో దూసుకెళ్తుండటంతో మహాకూటమి పక్షాన టికెట్ ఆశీస్తున్న ఆశావహుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టికెట్ తమకే వస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికి వస్తుందో..రాదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో హుస్నాబాద్ సీటు కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, దుబ్బాక టికెట్ కోసం టీజెఎస్ నేతలు తీవ్రంగా పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మహాకూటమి పక్షాన ఏ నియోజక వర్గం ఏ పార్టీకి కేటాయిస్తారో, ఆ పార్టీ పక్షాన ఎ అభ్యర్థి పోటీ చేస్తారనే విషయంపై స్పష్టత వచ్చేందుకు మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు టికెట్ ఆశీస్తున్న వివిధ పార్టీల ఆశావహులకు నిరీక్షణ తప్పదు!