తెలంగాణ

బెంగళూరు బుక్ ఫెయిర్‌లో తెలుగు సాహిత్య పరిమళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రపంచ గతిని మార్చే శక్తిసామర్థ్యాలు పుస్తకాలకు ఉంటాయని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు.
మంగళవారం సాయంత్రం బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 13వ బెంగళూరు పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రపంచ సాహితీవేత్తలు అనే పుస్తకాన్ని బెంగళూరు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ఎఎన్ రామచంద్ర, జూలూరు గౌరీశంకర్, కోయి చంద్రమోహన్‌లు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ పుస్తకాలు సామాజ నిర్మాణానికి పునాదులుగా నిలుస్తాయని తెలిపారు. ఎవరి మాతృభాషను వారు సంరక్షించుకోవడానికి , ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి ఈ పుస్తక ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా దేశంలోని 60 మంది పబ్లిషర్స్‌ను డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగే బుక్ ఫెయిర్‌కు రావాలని కోరారు. పొరుగు రాష్ట్రాలు పుస్తకాలతో ఏర్పాటు చేసుకునే సంబంధాలు బలంగా ఉంటాయని కన్నడ, తెలుగు రెండు భాషలు అన్నదమ్ముల్లాంటివని ఈ సందర్భంగా గౌరీశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ ప్రతినిధి ఎండీ ఖయూం, క్రియా మాద్యమం డైరెక్టర్ చంద్రశేఖర్, బెంగళూరు బుక్ ఫెయిర్ కార్యదర్శి హరీంద్ర తదితరులు పాల్గొన్నారు.
డీఈడీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో నమోదు చేసుకున్న ఉపాధ్యాయులు రెండో సంవత్సరపు పరీక్ష ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించేందుకు ఈ నెల 25 వరకూ గడువు విధించారు. ఉపాధ్యాయ అభ్యర్ధులు అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని సంచాలకుడు అనిల్ కుమార్ తెలిపారు.
సర్వీసు కమిషన్‌లో బతుకమ్మ
బతుకమ్మ ఉత్సవాన్ని పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యాలయ సిబ్బంది అంగరంగవైభవంగా నిర్వహించారు. బతుకమ్మను చైర్మన్ ఘంటా చక్రపాణి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మహిళా ఉద్యోగినులతో పాటు కార్యదర్శి వాణీ ప్రసాద్ కూడా బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు. బతుకమ్మ ఆడపడుచుల పండుగ అని ఘంటా చక్రపాణి చెప్పారు. మూడేళ్ల తర్వాత ఈసారి కమిషన్‌లో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక నుండి ప్రతి ఏటా సర్వీసు కమిషన్ మహిళా ఉద్యోగులు బతుకమ్మ పండుగ జరుపుకోవాలని అన్నారు.
గురుకుల లెక్చరర్ల పోస్టులకు
డిసెంబర్ 12న పరీక్ష
గురుకులాల్లో 281 జూనియర్ లెక్చరర్ల పోస్టులు, 466 డిగ్రీ లెక్చరర్ల పోస్టుల ఎంపికకు లిఖిత పరీక్షను డిసెంబర్ 15న నిర్వహించనున్నట్టు గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. జూలై 31, ఆగస్టు 2 తేదీల్లో జారీ చేసిన నోటిఫికేషన్లలో ఇందుకు సంబంధించిన వివరాలను పొందుపరిచినట్టు అధికారులు తెలిపారు.