తెలంగాణ

22 నుండి లాసెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ లాసెట్ అడ్మిషన్ల కౌనె్సలింగ్ ఈ నెల 22న ప్రా రంభం కానుంది. ఇందుకోసం నాలుగు రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ బీ ద్వారకానాధ్ చెప్పారు. 17 ప్రైవేటు, నాలుగు యూనివర్శిటీ కాలేజీలతో పాటు 21 లా కాలేజీల్లో మూడేళ్ల లా కోర్సు, ఐదేళ్ల లా కోర్సు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలు జరుగుతాయని చెప్పారు. అన్ని కాలేజీల్లో కలిపి ఎల్‌ఎల్‌బి మూడేళ్ల కోర్సులో 2880 సీట్లు, ఐదేళ్ల కోర్సులో 968 సీట్లు, ఎల్‌ఎల్‌ఎంలో 553 సీట్లు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఎవీ కాలేజీ, కేశవ్ మెమోరియల్ కాలేజీ, యూనివర్శిటీ పీజీ కాలేజీలో అడ్మిషన్ల కౌనె్సలింగ్ జరుగుతుందని అన్నారు. వరంగల్‌లో కాకతీయ యూనివర్శిటీ క్యాంపస్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్‌లో కౌనె్సలింగ్ జరుగుతుందని అన్నారు. 22న ఉదయం 9 గంటలకు కౌనె్సలింగ్‌లో భాగంగా సర్ట్ఫికేట్ల పరిశీలన మొదలవుతుందని అన్నారు. 22న 1వ ర్యాంకు నుండి 4400 ర్యాంకు వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుంది. 23న 4401 ర్యాంకు నుండి 8600 ర్యాంకు వరకూ, 24న 8601 ర్యాంకు నుండి చివరి ర్యాంకు వరకూ అభ్యర్ధుల సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుంది. 25న ఐదేళ్ల లా కోర్సు వారికి, అదే రోజు సాయంత్రం ఎల్‌ఎల్‌ఎం కోర్సు వారికి కౌనె్సలింగ్ జరుగుతుందని చెప్పారు. వీరంతా సర్ట్ఫికేట్ల వెరిఫికేషన్‌కు హాజరైన తర్వాత రోజు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. స్పెషల్ కేటగిరి అభ్యర్ధుల్లో ఎన్‌సిసి ఉన్న వారు 24 ఉదయం, పిహెచ్, సిఎపీ అభ్యర్ధులు 24వ తేదీ సాయంత్రం హైదరాబాద్ గగన్‌మహల్‌లోని ఏవీ కాలేజీలో సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరుకావాలని పేర్కొన్నారు. తొలి రోజు 22వ తేదీ ఏవీ కాలేజీలో 1 నుండి 500 ర్యాంకు వరకూ, 1501 నుండి 1800 ర్యాంకు వరకూ, 2601 నుండి 3200 ర్యాంకు వరకూ హాజరుకావాలి. కేశవ్ మెమోరియల్‌లో 501 నుండి 1000, 1801 నుండి 2200, 3201 నుండి 3800, యూనివర్శిటీ పీజీ కాలేజీలో 1001 నుండి 1500, 2201 నుండి 2600, 3801 నుండి 4400 ర్యాంకు వరకూ, కాకతీయ వర్శిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్‌లో కౌంటర్‌కు 1 నుండి 1500 ర్యాంకు వరకూ, 1501 నుండి 2600, 2601 నుండి 4400 ర్యాంకు వరకూ అభ్యర్ధులు హాజరుకావచ్చు.