తెలంగాణ

నేటి నుండి రైతుబంధు అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: యాసంగి పంటలకు సంబంధించిన రైతుబంధు పథకం సోమవారం నుండి అమల్లోకి వస్తోంది. ఈ పథకం అమలు చేసేందుకు నిధుల కొరత లేదని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. ఆదివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడారు. తొలిరోజు దాదాపు ఐదు లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బు జమచేసేందుకు ఏర్పాట్లు చేశారు. యాసంగి పంటలకోసం జూలై నెలలోనే 6000 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీఓ ఇచ్చామని పార్థసారథి గుర్తు చేశారు. ఎకరాకు నాలుగువేల రూపాయల చొప్పున లెక్కకట్టి రైతులకు సాయం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో వ్యవసాయ అధికారులు (ఏఓ), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ) లు ఈ విషయంలో తీరిక లేకుండా ఉన్నారు.