తెలంగాణ

గెలుపు వ్యూహాలకు కమలం పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 21: రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్య కూడలిగా తెలంగాణలో ప్రత్యేక స్థానం పొందిన సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిత్వం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుకు ఖరారైంది. పార్టీ అధిష్ఠానం ప్రకటించిన తొలి జాబితాలో ఈమేరకు ప్రకటించారు. అధికారికంగా అభ్యర్థిత్వం ప్రకటించనప్పటికీ ఇప్పటికే ముమ్మర ప్రచారంతో దూసుకుపోతున్న సంకినేని సీటు ఖరారు కావడంతో మరింతగా ప్రచార వేగాన్ని పెంచారు. దీంతో పాటు ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరిన సంకినేని అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గట్టి పోటీనిచ్చారు. అప్పటి ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ ఇండిపెండెంట్‌గా పోటీచేసి ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే అధిక్యం సాధించి సత్తాచాటారు. కేవలం 2,219 ఓట్ల తేడాతో ఓటమి పాలై రెండవస్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటూ బీజేపీని పటిష్టం చేసేలా కృషిచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభను నిర్వహించడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో అనేక కార్యక్రమాలను నిర్వహించి సూర్యాపేటలో కమలాన్ని వికసింపజేశారు. సంకినేని రాకతో బలం రెట్టింపైంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపడంతో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తూ స్థానికంగా ప్రధాన ప్రతిపక్ష నేత పాత్రను పోషించిన సంకినేని మరోవైపు పలు సభల ద్వారా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైనందున ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
భారీ చేరికలతో జోష్
అసెంబ్లీ రద్ధు తర్వాత టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి జగదీశ్‌రెడ్డి పేరు ఖరారైన సంగతి తెలిసిందే. ఆ తదుపరి వారం రోజులకే సంకినేని ప్రజాక్షేత్రంలోకి దూకారు. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించుకొని కదన రంగంలోకి దిగారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈసారి బీజేపీ అభ్యర్థిగా గెలుపుబావుటా ఎగురవేసేలా ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుండి అధికార పార్టీ నుండి మొదలుకొని అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా బీజేపీలో చేర్చుకునేలా మంత్రాంగాన్ని నడిపారు. బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకమన్న అపప్రదను ప్రజల్లో తొలగించే లక్ష్యంతో జిల్లాకేంద్రంతో పాటు అన్ని మండలాల్లోనూ మైనార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో మైనార్టీలను పార్టీలో చేరేలా మంత్రాంగాన్ని నడిపి సఫలీకృతలయ్యారు. ఎలాగైనా ఈసారి సూర్యాపేటపై కమల జెండాను ఎగురవేయాలనే ధృడసంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
అగ్రనేతలతో ప్రచార సభలకు వ్యూహం
సూర్యాపేటలో సంకినేని గెలుపును ప్రతిష్టాత్మకంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం భావిస్తోంది. పార్టీ ఇమేజ్‌తో పాటు సంకినేని వ్యక్తిగత ఇమేజ్‌తో ఈసారి ఇక్కడ పాగా వేసేలా పావులు కదుపుతోంది. ఇందుకోసం ప్రచారపర్వంలోకి అగ్రనేతలను దింపాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
సంకినేని గెలుపుకోసం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారి, జెపీ నడ్డాలతో పాటు జాతీయ పార్టీ నేతలు, రాష్ట్ర నాయకులతో నియోజకవర్గ వ్యాప్తంగా ముమ్మర ప్రచారం చేయించేలా ప్రణాళికను సంకినేని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఒక వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమయం కేటాయించిన పక్షంలో సూర్యాపేటలో భారీ బహిరంగసభను ఏర్పాటుచేయాలనే యోచనలో ఉన్నట్లుగా ఆపార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.