తెలంగాణ

బీసీలు ఏకమైతే రాజ్యాధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, అక్టోబర్ 21 : తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో బీసీ కులాలకు చెందిన ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యమైతే రాజ్యాధికారం బీసీలదేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన బీసీల పొలికేక, గర్జన సభలో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 71 సంవత్సరాలు దాటినా బీసీ కులాలకు అధికారం రాకపోవటానికి అగ్రకులాలకు చెందిన బడా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించక తప్పదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కే చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయినా, దేశానికి మోదీ ప్రధాని అయినా ఎవ్వరూ ఎవరితో యుద్ధం చేయలేదని తుపాకులు పట్టలేదని ఓట్ల ద్వారానే అధికారంలోకి వచ్చారని ఓట్ల ద్వారానే బీసీలు కూడా అధికారంలోకి వస్తారని గమనించాలని అన్నారు. అమెరికా, చైనా, కెనడా, రష్యా తదితర దేశాలలో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలకే పేదలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందారని, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయినారని మన దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలను ఓట్లకే వాడుకుంటున్నారని వారి పట్ల చిత్తశుద్ధి లేదని కృష్ణయ్య అన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చిన్న చిన్న సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి బీసీలను ఓట్ల కొరకు మచ్చిక చేసుకుంటున్నాయని, వారి ఆర్థికాభివృద్ధి శాశ్వత పథకాలు ప్రవేశపెట్టడం లేదని ఆయన అన్నారు. బీసీ విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, పీజు రీయంబర్స్‌మెంట్, స్థానిక సంస్థలలో రిజర్వేషన్‌లు వచ్చినా బీసీ సంఘాలు చేసిన పోరాటాల ఫలితమేనని, నిరంతరం బీసీల అభివృద్ధికి ఆలోచనలు, ఉద్యమాలు, పోరాటాలు చేస్తూనే ఉన్నామని, బీసీ సబ్ ప్లాన్ 20 వేల కోట్ల రూపాయలతో అమలు చేయాలని, బీసీలకు ఉద్యోగాలలో, విద్యారంగంలో, రాజకీయాలలో 50 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని అన్నారు. ఈ సభలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మండవ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..హుజూర్‌నగర్‌లో జరిగిన బీసీల పొలికేక సభలో మాట్లాడుతున్న సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య