తెలంగాణ

జూరాలకు వరద నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, అక్టోబర్ 21: నాలుగు రోజులుగా కర్ణాటక, కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో కురిసిన వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు ఏడు వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్టు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని జూరాల జలాశయంలో 317.480 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతం నుండి 7 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, కుడి, ఎడమ కాలువలకు 2,030 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జలాశయంలో 88.1 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, దిగువకు 14,480 క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయంలో 32.44 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతం నుండి 12,173 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 12,443 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు జూరాల అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటితో జూరాల జలాశయం కళకళలాడుతోంది. నెల రోజులుగా జూరాలకు వరద నీరు తగ్గిపోగా, రెండు రోజుల నుండి వస్తున్న స్వల్ప వరద నీటితో ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం.. వరద నీటితో నిండిన జలాశయం