తెలంగాణ

‘కూటమి’ని కూకటివేళ్లతో పెకలిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, అక్టోబర్ 22: ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా వంచకపాలన చేసిన కాంగ్రెస్, టీడీపీల కుట్రలతో మహా కూటమి ఏర్పడగా, ఆ కూటమిని కూకటి వేళ్లతో పెకలిద్దామని మాజీ ఎమ్మెల్యే, మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. సోమవారం గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ ప్రచార శంఖారావం పూరించిన సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. అధికారం కోసం కాంగ్రెస్ తాపత్రయ పడుతుండగా, తెలంగాణపై పెత్తనం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఆరాటపడుతున్నట్లు ఎద్దేవా చేశారు. అయితే ఇక్కడి వారిని కష్టాల పాలు చేసిన ఆ పార్టీలను ఎవరూ విశ్వసించరని, కొత్తకొత్త ఎత్తులతో, కుట్రలు, కుతంత్రాలతో ప్రజల్లోకి వస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలకు ప్రజలే తగిన విదంగా సమాధానం చెప్పాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తూ అన్ని వర్గాలు, అన్ని రంగాలను పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్ మరోసారి రాష్ట్రానికి సీఎం కావడం ఖాయమని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ సీట్ల పంపకాల్లో జుట్లు పట్టుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ, జనసమితి, సీపీఐలు బజారున పడడం ఖాయమని, ఇప్పుడే సీట్ల కోసం తన్నుకుంటున్న వారు ఇక రాష్ట్రానికి ఎలా ప్రాతినిథ్యం వహిస్తారని నిలదీశారు. రాష్ట్రంలో యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు భూములు సస్యశ్యామలం కానుండగా, మిషన్‌భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందని చెప్పారు. కాగా, గజ్వేల్ ప్రజలు విజ్ఞులని, అభివృద్ధిని పరుగులు పెట్టించిన సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచి ఆదరిస్తారని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో అద్భుతమైన మేనిఫెస్టో రూపకల్పన చేయగా, సకలజనులకు ఆమోదయోగ్యంగా ఉందని హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నట్లు వివరించారు. కాగా, జగ్‌దేవ్‌పూర్ మండలానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మెన్‌లు తూంకుంట నర్సారెడ్డి, పన్యాల భూపతిరెడ్డి, గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ అరుణ భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గజ్వేల్‌లో ప్రసంగిస్తున్న మంత్రి హరీష్‌రావు...