తెలంగాణ

హైకోర్టు విభజనకు బీజేపీ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: హైకోర్టు విభజనకు బీజేపీ ఎనలేని కృషి చేసిందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు నుండి హైకోర్టు విభజనకు బీజేపీ కృషి చేసిందని అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలతో హైకోర్టు విభజనకు కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయని అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ ఆటంకాలను అధిగమించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు మార్గం సుగమం చేసిందని చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలనే రాష్ట్ర ప్రజల ఆంకాంక్ష, ముఖ్యంగా న్యాయవాదుల ఆకాంక్ష మేరకు త్వరలోనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కానుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సాంకేతిక ఇబ్బందులను తొలగించిన ప్రధాని నరేంద్రమోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జనవరి ఒకటో తేదీ నుండి ఏపీ, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయడం ప్రారంభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌డీఎ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమే సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులని ఆయన వ్యాఖ్యానించారు.