తెలంగాణ

కూటమిని పాతరేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 5: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోజూస్తున్న మహా కూటమిని పాతరేద్దామని మాజీ ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ముదిరాజ్‌ల ఘర్జనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఉద్యమ పార్టీగా, పదవులను తృణప్రాయంగా వదిలిన టీఆర్‌ఎస్‌ను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదని, తెలంగాణలో నూకలు చెల్లిన టీడీపీకి ఇక్కడ ఏమి పని అని నిలదీశారు. సమైఖ్య రాష్ట్రంలో సకలజనులు అష్టకష్టాలు పడగా, కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని నక్కలపాలు చేసేందుకు సిద్ధంగా లేమని తెలిపారు. తెలంగాణలో టీడీపీకి ఎప్పుడో నూకలు చెల్లగా, డిసెంబర్ 12 తర్వాత కాంగ్రెస్ సైతం అదే దారి పట్టక తప్పదని ఎద్దేవా చేశారు.
అసమాన త్యాగాలు ముదిరాజ్ బిడ్డలకే సాద్యం కాగా, సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని అమరుడైన పోలీసు కిష్టయ్య గొప్ప త్యాగవనుడని తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ముదిరాజ్ బిడ్డ ప్రకాశ్‌ను పెద్దల సభకు పంపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుండగా, 46వేల చెరువులపై సర్వహక్కులు ముదిరాజ్‌లకు కల్పిస్తున్న కేసీఆర్‌కు ఎప్పుడూ రుణపడి ఉందామని తెలిపారు. దళారి వ్యవస్థ నిర్మూలణకు కట్టుబడిన టీఆర్‌ఎస్ చెరువులు, కుంటలలో చేపల పెంపకం చేపట్టగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుంచేందుకు కేసీఆర్ పూర్తి స్థాయిలో అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. వచ్చే యేడాదిలో 3వందల కోట్ల చేపపిల్లలు పెంచే అవకాశం కలుగనుండగా, ముదిరాజ్‌ల స్థితిగతులపై కేసీఆర్‌కు మంచి అవగాహన ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ దర్మబద్దమైన, న్యాయబద్దమైన పాలన చేస్తుండగా, జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు.
జిల్లాలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌లు ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టం కాగా, కంటికి రెప్పలా కాపాడుకునే వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.

చిత్రం..ప్రసంగిస్తున్న మంత్రి ఈటల రాజేందర్