తెలంగాణ

వంటేరు, రేవూరి వ్యాఖ్యల వెనుక బాబు హస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: మంత్రి హరీశ్‌రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, టీడీపీ నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఇరువురు వెంటనే క్షమాపన చెప్పాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యల వెనుక టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి హస్తం ఉందని టీఆర్‌ఎస్ ఆరోపించింది. వంటేరు ప్రతాప్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఇద్దరినీ చంద్రబాబు శిఖండిల్లా వాడుకుంటున్నారని టీఆర్‌ఎస్ మండిపడింది. చంద్రబాబుకు దమ్ముంటే టీఆర్‌ఎస్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొవాలని సవాల్ చేసింది. తెలంగాణ భవన్‌లో సోమవారం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచందర్‌రావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ, వంటేరు ప్రతాప్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని హరీశ్‌రావు సవాల్ చేస్తే కాంగ్రేస్ నేతలు పారిపోయారన్నారు. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని వారు గుర్తు చేశారు. ఎన్టీఆర్ భవన్ అబద్దాల ఫ్యాక్టరీగా మారిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు వదిలిన మరో విషపు బాణం రేవూరి ప్రకాశ్‌రెడ్డి అని దుయ్యబట్టారు. ఎన్ని బాణాలు వదిలినా టీఆర్‌ఎస్‌ను ఏమీ చేయలేవన్నారు. చంద్రబాబు నాయుడు కుట్రలకు తెరదీస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని వారు హెచ్చరించారు. రేవూరి, వంటేరు తక్షణం హరీశ్‌రావుకు క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని టీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు లక్షలకుపైగా ఇళ్లు నిర్మించామని ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో కర్నే ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రలు పదే పదే ఆయుశ్మాన్‌భవ పథకాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారన్నారు. దాని కంటే తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆరోగ్యశ్రీ పథకం వెయ్యి రెట్లు మెరుగైందని కర్నే గుర్తు చేశారు.
ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
బీజేపీ నాయకుడు స్వామి పరిపూర్ణాంద స్వామి, కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డిపై ఎన్నికల కమిషన్‌కు టీఆర్‌ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. నల్లగొండలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పరిపూర్ణాంద స్వామి ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేశారని, అలాగే కాంగ్రెస్ నాయకుడు వంటేరు మంత్రి హరీశ్‌రావు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఇరువురి వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘనగా పరిగణించి చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది.