తెలంగాణ

4,258 బాణసంచా దుకాణాలకు లైసెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: దీపావళి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 4, 258 దుకాణాలకు లైసెన్సు మంజూరు చేసినట్టు రాష్ట్ర ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ గోపీకృష్ణ వెల్లడించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1436, హైదరాబాద్‌లో 946 దుకాణాలకు లైసెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. కరీంనగర్ 258, ఖమ్మం 339, వరంగల్ 371, మహాబుబ్‌నగర్ 90, నిజామాబాద్ 189, మెదక్ 180, నల్గొండ 144 దుకాణాలకు లైసెన్స్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సోమవారం బీఆర్‌కేఆర్ భవన్‌లోని తన కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫైర్ స్టేషన్ రిజనల్ అధికారులు ప్రసాన్న కుమార్, పాపాయ్య, లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. కాగా బాణ సంచాకాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధీకృత లేదా లైసెన్స్ కలిగిన అమ్మకందారు నుంచి బాణసంచా కొనుగోలు చేయాలని అన్నారు. బాణసంచాను పోడిగా, చల్లటి ప్రదేశంలో భద్రపరచుకోవాలని ఆయన సూచించారు. దీపావళి మందులు కాల్చేసమయంలో దళసరి కాటన్ దుస్తులు దరించాలని నగర పౌరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. నిప్పురవ్వలకు దూరంగా మందుగొండు సామగ్రి ఉంచాలని, పిల్లలకు అందకూండా చూడాలని పేర్కొన్నారు. అలాగే ఆరుబయటే బాణా సంచ కాల్చాలని, బహిరంగ ప్రదేశం అత్యంత అనుకూలమని చెప్పారు. కచ్చితంగా కాళ్లకు చెప్పులు,కళ్లు జోడు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారు కాలుష్యానికి దూరంగా ఉండాలని సూచించారు. శబ్ద కాలుష్యం వల్ల ఎటువంటి నష్టం జరగకుండా ప్రజలు చెవులను కప్పివుంచే సాధనాలను ధరించాలన్నారు. దురదృష్టవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగితే నీళ్లు చల్లడం లేదా దుప్పటి చుట్టడం చేయాలని, పడుకోవటం, దొర్లించడం ద్వారా అగ్నిని అర్పివేయాలని పేర్కొన్నారు. కళ్లలో నిప్పురవ్వలు పడితే కుళాయి నీటితో 10 నిమిషాల పాటు కన్నును కడగాలని, తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లాలని గోపీకృష్ణ స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే 101లేదా, 9949991101 సమీప ఫైర్ స్టేసన్‌కు కాల్ చేయాలని పిలుపు నిచ్చారు. 2016లో 27 బాణసంచా కేసులు నమోదు కాగా, 2017లో 12 చిన్న కేసులు నమోదయినట్టు చెప్పారు. దీపావళి పండుగ రోజున ఫైర్ స్టేషన్ సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటారని వెల్లడించారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ గోపీకృష్ణ