తెలంగాణ

భవిష్యత్తులో మరింతగా విద్యుత్‌రంగ ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 5: నేడు తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని, ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని అంథకారం చేసి తద్వారా సాధించుకున్న రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, గతంలో బాబు కుట్రలు ఛేదించి సీఎం కేసీఆర్ కఠోర శ్రమతో ఇంతటి గొప్ప విజయం సాధించారని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దేశంలోనే విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో తాము నాలుగున్నరేళ్లలో సాధించిన విజయాలకు సీఎం కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటుకు ముందునుంచే రూపొందించిన ప్రణాళికలే దోహదపడ్డాయన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు విద్యుత్ కోతలతో రైతులు, ప్రజలు, పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, సమైక్య పాలనలో విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలే రోడ్డెక్కిన పరిస్థితులు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడితే విద్యుత్ సంక్షోభం వస్తుందని, చీకట్లు కమ్ముకుంటాయని సమైక్య పాలకులు భయపెట్టి ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించారన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వకపోగా ధరలు అమాంతం పెంచి పరిశ్రమలను మూసివేసేలా కుట్రలు చేశారన్నారు. ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలోనే పారిశ్రామికవేత్తలు శభాష్ అనేవిధంగా విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఇంతటి గొప్ప విజయంలో సంబంధిత విద్యుత్ శాఖ మంత్రిగా తన పాత్ర ఉండటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. టీఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత పారిశ్రామిక రంగం పురోగమిస్తుందన్నారు. ప్రగతి సూచికైన విద్యుత్ వినియోగంలో రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలవడం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి కొలమానంగా భావించాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్ అందిస్తుండటం వల్ల కొత్తగా ఏడు వేల పరిశ్రమలు ఏర్పాటై ఐదు లక్షల మందికి ఉపాధి కలగడంతోపాటు లక్షా 28 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీకి పారిశ్రామిక సమాఖ్య అండగా నిలుస్తుందన్నారు. సమాఖ్య నాయకులు విశే్వశ్వరరావు, సత్యనారాయణ, సుధాకర్‌రెడ్డి, సాంబిరెడ్డి, బోనాల రవీందర్, పెద్దిరెడ్డి గణేష్, డాక్టర్ రామ్మూర్తి, లక్కపాక పాండు పాల్గొన్నారు.
చిత్రం..పారిశ్రామికవేత్తల సమాఖ్య అభినందన సభలో ప్రసంగిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి