తెలంగాణ

ఆశావహుల్లో టెన్షన్.. టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 8: ముందుగా ప్రకటించనట్లుగానే దీపావళి తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామన్న కాంగ్రెస్ ఈ మేరకు పూర్తి స్ధాయిలో వేగంగా కసరత్తును ప్రారంభించింది. టెకెట్ల కేటాయింపులో ఇప్పటికే వెనుకబడ్డ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఏవిధంగా ఉంటుదోనని ఆందోళన చెందుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఒకవైపు ఇంటిపోరు మరో వైపు మిత్రపక్షాల ఒత్తిడితో అభ్యర్థుల, సీట్ల కేటాయింపు కత్తిమీద సాములాంటిదే. టీపీసీసీ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పోటీ చేయాల్సిన స్థానాలు, మిత్ర పక్షాలకు ఇచ్చే స్థానాలు గుర్తుంచి ఢిల్లీ కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ముందు పెట్టింది. టీపీసీసీ ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్, రెండు స్థానాల్లో టీజెఎస్ మరో స్థానంలో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది. రాహుల్ ఆమోదముద్ర కోసం ఢిల్లీకి పంపిన జాబితాను కొందరు కాంగ్రెస్ నాయకులు మీడియాకు లీకు చేయడంతో ఆశావహుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అంతేకాకుండా సీట్ల కేటాయింపు లీకులపై అనేక చోట్ల ఆందోళనలు, నిరసనలు ఇప్పటికే వ్యక్తం అయ్యాయి. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీట్ల కేటాయింపులపై వివరణ ఇచ్చుకోవల్సి వచ్చింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్థానాలను ప్రకటించలేదని చెప్పారు. అయినప్పుటికీ ఆశావాహుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠం నెలకొంది. మరి కొన్ని గంటల్లోనే పోటీ చేసే అభ్యర్థుల జాబితా వెల్లడి కానున్న నేపథ్యంలో అశావాహులంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుండెకాయ లాంటి వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ రెండు కీలక స్థానాలు కూడా పొత్తులో భాగంగా మిత్రపక్షమైన టీజేఎస్, టీడీపీలకు కేటాయించారు. వరంగల్ ఈస్ట్, వర్ధన్నపేట ఈ రెండు స్థానాలను టీజేఎస్‌కు కేటాయించగా వరంగల్ వెస్ట్ స్థానాన్ని టీడీపీ కేటాయించినట్లు సమాచారం. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకమైన వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కేటాయించినట్లు లీకులు రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీకి కనీసం క్యాడర్, కార్యకర్తలు కూడా లేరని పొత్తులో భాగంగా కాంగ్రెస్ సూనాయాసంగా గెలుచుకునే వరంగల్ వెస్ట్‌ను టీడీపీకి కేటాయించవద్దని వరంగల్ డీసీసీ భవన్ ముందు ఆందోళనకు దిగారు. మరో వైపు వరంగల్ తూర్పు, వర్ధన్నపేటను టీజేఎస్‌కు కేటాయించారు. తూర్పు నుండి టీజేఎస్ అభ్యర్థిగా గాదె ఇన్నయ్య, వర్ధన్నపేట నుండి టీజేఎస్ అభ్యర్థిగా దేవయ్య పోటీలో ఉన్నట్లు తెలిసింది. ఈ రెండు కీలక స్థానాలను మిత్ర పక్షాలకు కేటాయించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. కార్యకర్తల ఆందోళనలను విరమించేందుకు డీసీసీ నాయిని రాజేందర్‌రెడ్డి రంగంలో దిగారు. కార్యకర్తలు ఎవ్వరు ఆధైర్య పడవద్దని వరంగల్ పశ్చిమ కాంగ్రెస్‌దేనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మరో వైపు వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని టీజేఎస్‌కు కేటాయించడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలల్లో ఆందోళన కొనసాగుతుంది. ఆనధికారికంగా ఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిటీకి టీపీసీసీ ఇచ్చిన జాబితా ఈ విధంగా ఉన్నట్లు సమాచారం. భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు సీతక్క, పరకాల ఇనగాల వెంకట్రాంరెడ్డి/ కొండా సురేఖ, జనగామ పొన్నాల లక్ష్మయ్య, పాలకుర్తి జంగా రాఘవరెడ్డి, స్టేషన్‌ఘనపూర్ ఇందిరా లేదా డాక్టర్ విజయరామరావు, మహబూబూబాద్ బలరాంనాయక్, డోర్నకల్ రాంచందర్ నాయక్, నర్సంపేట దొంతి మాధవరెడ్డి, వరంగల్ వెస్ట్ టీడీపీకైతే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్‌కు అయితే, నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ తూర్పుకు గాదె ఇన్నయ్య (టీజేఎస్), వర్ధన్నపేట దేవయ్య (టీజేఎస్)కు ఇచ్చినట్లు సమాచారం.