తెలంగాణ

అది కాంగ్రెస్ దుష్ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, నవంబర్ 8: 70 మంది అభ్యర్థులు లేని బీజేపీ 70 సీట్లు గెలుస్తామని చెప్పడం హాస్యాస్పదమని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ కనుమరుగు అవుతుందని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో జరిగిన ముస్లిం మైనార్టీల నియోజకవర్గస్థాయి ‘ఆశీర్వాద సభ’లో మంత్రి ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ముస్లిం సోదరుల పట్ల చేపడుతన్న సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో ముస్లింలు ఈ ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌ను బద్నాం చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోందనీ.. అందులో భాగంగానే కేసీఆర్ బీజేపీతో కలిసి పనిచేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నాడని, అలాంటి పని కేసీఆర్ ఎప్పుడూ చేయలేదన్నారు. కాంగ్రెస్, చంద్రబాబు కలిసి పనిచేస్తున్నాడని అంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టబోతున్నదని అమిషా చెబుతున్నాడని, 70 సీట్లు గెలువడం కాదు, 70 మంది తన వద్ద లేరని, వంద సీట్లు టీఆర్‌ఎస్ గెలుస్తుందని, బీజేపీ పేరు లేకుండా పోతుందని కేటీఆర్ అన్నారు. ముస్లింలకు కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ అన్ని మతాలకు, అన్ని పండుగలకు పేదలకు కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నదని అన్నారు.
గత ప్రభుత్వాలు 2007 నుండి 2014 వరకు కేవలం రెండు వేల కోట్లు ఖర్చు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఒకే సంవత్సరంలోనే రెండు వేల కోట్ల ఖర్చు చేసిందని, అలాగే ముస్లిం సోదరుల సంక్షేమానికి తమ ప్రభుత్వం నాలుగు వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. పేద ముస్లింలను ఆదుకుంటూ వీరికి సంక్షేమ రంగంలో పెద్దపీట వేస్తున్నదని, బీజేపీ చెవిలో పూలు పెడుతోందని.. కారు ఎక్కడా ఆగకూడదని, కేసీఆర్ డ్రైవింగ్ చేస్తున్నాడని, దానికి ప్రజలు పెట్రోల్, డీజిల్ వేయాలని మంత్రి కె.తారకరామారావు పిలుపునిస్తూ, ఈ ఎన్నికల్లో ముస్లింలు తమకు సంపూర్ణంగా మద్దతు నివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్, ఎమ్మెల్సీ సలీం, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సెస్ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి, మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షులు ఎండి.సత్తార్, మైనార్టీ నాయకులు యూసుఫ్, సరుూద్ ఖాన్, సర్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ‘ముస్లింల ఆశీర్వాద సభ’లో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్