తెలంగాణ

సీపీఐలో పెల్లుబికిన అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: మహాకూటమిలో సర్దుబాట్లు తలనొప్పిగా మారాయి. తాము కోరిన సీట్లు ఇవ్వలేదన్న ఆగ్రహం సీపీఐలో నెలకొంది. అనేక దఫాలుగా చర్చలు జరుగుతున్నా అడిగిన అసెంబ్లీ సీట్లు దక్కకపోవడంతో సీపీఐలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే కాంగ్రెస్ నాన్పుడు ధోరణి పట్ల పార్టీ మండిపడుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో సీపీఐ అత్యవసర సమావేశం ఏర్పాటు జరగనుంది. మహాకూటమితో ఉండాలా? వద్దా అన్న అంశంపై సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. మహాకూటమి నిర్ణయంతో సీపీఐ ఆత్మరక్షలో పడింది. ముందుకు పోదామా లేక ఇండిపెండెంట్లుగా బరిలో నిలబడడమా?, ఒక వేళ అదే నిజమైతే ఎంతమంది అభ్యర్థలను రంగంలోకి దించుదాం అన్నదానిపై తర్జన భర్జన పడుతోంది. అలాగే నేతల నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై కేడర్‌లోఉత్కంఠ నెలకొంది.
మహాకూటమి ఇస్తానన్న సీట్లకు ఒప్పేసుకుంటే పార్టీలో ఆశావహుల నుంచి ఎదురైయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయన్న దానిపై సమాలోచనలను వేగవంతం చేస్తోంది. 40 రోజులుగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ గుర్రుగా ఉంది. శుక్రవారం జరిగే పార్టీ సమావేశంలో అన్నింటిపైనా క్షుణ్ణంగా చర్చించనున్నారు. కాగా మూడు అసెంబ్లీ, 2 ఎమ్మెల్సీ పదవులతో సర్దుకుపోవాలని మహాకూటమి చెప్పినట్టు తెలిసింది. దీనిపై సీపీఐ కేడర్‌లో నిరసన వ్యక్తమవుతోంది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గురువారం సాయంత్రం ఇక్కడ ముఖ్దూమ్ భవన్‌లో భేటీ అయ్యారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపులపై కాంగ్రెస్ సూచించిన స్థానాలు సీపీఐ నేతలకు రుచించడంలేదు. తమకు బలం ఉన్న సీట్లు అడుగుతుంటే పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.
తాము ఇచ్చిన సీట్లలోనే పోటీ చేసుకోండి అన్న తీరులో మహాకూటమి చెప్పడం సరైంది కాదని వారు అన్నారు. ఇదే విషయంపై గురువారం రాత్రి పార్టీ సీనియర్ నేత డాక్టర్ సుధాకర్ ఆంధ్రభూమితో మాట్లాడుతూ ‘శుక్రవారం పార్టీ కార్యవర్గ సమావేశంలో అసెంబ్లీ సీట్ల అంశంపై చర్చిస్తాం. సమావేశం అనంతరం అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తాం’అని వెల్లడించారు.