తెలంగాణ

ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోడంతో రాష్ట్రంలో రైతులు రోడ్లెక్కుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి నేరుగా సొసైటీల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడిపెట్టి ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే దళారీలు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆయన అన్నారు. దళారీలు రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తరుగు పేరుతో ధాన్యాన్ని తక్కువ ధరకు బేరమాడడం దారుణమని అన్నారు. బీపీటీ ధాన్యం క్వింటాల్‌కు రూ. 1800 చెల్లించాల్సి ఉండగా కేవలం 1400 చెల్లిస్తామని చెబుతున్నారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతుబంధు పథకాలు ఎన్ని తెచ్చినా ప్రయోజనం ఉండదని చెప్పారు.