తెలంగాణ

బీజేపీతో తెరాసకు ఎలాంటి దోస్తీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 10: నిజమైన సెక్యులర్ పార్టీగా అందరి మన్ననలు అందుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీతో దోస్తీ చేసే అవసరం ఎంతమాత్రం లేదని, ఇకముందు కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ కరాఖండీగా తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలనే కుట్రతో కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ముస్లిం మైనార్టీలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. నిజానికి మహాకూటమి పేరుతో కాంగ్రెస్ జతకట్టిన తెలుగుదేశం పార్టీయే నిన్నమొన్నటి వరకు బీజేపీతో అంటకాగిన విషయం అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం 80స్థానాల్లో డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. శనివారం ఎం.పీ కవిత క్యాంప్ ఆఫీసులో ఆమెతో కలిసి మహమూద్‌అలీ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అసలు తెలంగాణలో బీజేపీకి అస్థిత్వమే లేదని అన్నారు. హైదరాబాద్‌లో ఆ పార్టీ తరఫున ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించినప్పటికీ, గ్రేటర్ ఎలక్షన్స్‌లో రెండంటే రెండు కార్పొరేటర్ స్థానాలతోనే సరిపెట్టుకోవడం బీజేపీకి తెలంగాణలో ఏపాటి బలముందో నిరూపించిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అల్లర్లు, మత ఘర్షణలకు తావులేకుండా శాంతియుత వాతావరణం నెలకొని ఉండేందుకు తమ పార్టీ బీజేపీని రాష్ట్రంలో బలోపేతం కానివ్వదని స్పష్టం చేశారు.