తెలంగాణ

బాధ్యతలు మరిచి బరితెగించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, నవంబర్ 10: సిబ్బందిని తోబుట్టువుల్లాగా చూడాల్సిన అధికారి, సభ్యసమాజాన్ని మరిచి మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరించిన సంఘన కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో జరిగింది. వివరాల్లోకి వెలితే గత నెల 25న చొప్పదండి మున్సిపాలిటీ కమిషనర్‌గా భాద్యతలు చేపట్టిన కమిషనర్ నిత్యానంద్ అదే రోజు నుంచి సిబ్బందిని గమనించిన కమిషనర్‌కు దర్బుద్ది కలిగినట్లుంది. మరుసటి రోజే మహిళా సిబ్బందికి ఫోన్ చేసి మీకు బంగారు కమ్మలు ఇస్తానంటు ప్రలోభాలాకు గురిచేయటం అది కాస్తా రికార్డు చేసిన సదరు మహిళా రహస్యంగా సోషల్ మీడియాకు లీక్ చేసింది. మరో పక్క హైదరాబాద్ జిహెచ్‌ఎంసి నుంచి బదిలీపై చొప్పదండి కమిషనర్‌గా భాద్యతలు చేపట్టిన నిత్యానంద్ తాను కొత్తగా రెంటుకు ఇళ్లు తీసుకొని అందులో పాలు పొంగియ్యాలంటు మహిళా సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే మిగితా పురుషులైన సిబ్బందిని అంతా పిలిచి మందుతో దావత్ ఇచ్చారు. అక్కడే మహిళలు మద్యం తాగినట్లు పడిపోయారంటు మీడియాకు గుర్తుతెలియని వ్యక్తులు సమాచారం అందించడంతో అక్కడికి వెళ్ళిన మీడియాకు సిబ్బంది తాగిన మందు బాటిళ్ళు, పుల్‌గా తాగిన సిబ్బంది కనిపించారు. అక్కడి నుంచి కమిషనర్ జారుకోవటంతో ఈ విషయం కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ లా వ్యాపించింది. దీంతో ఈ విషయాన్ని ఉన్నత అధికారల వద్దకు వెళ్ళటంతో శనివారం కరీంనగర్ ఆర్‌డిఒ ఆనంద్‌కుమార్ చొప్పదండి మున్సిపల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీనివాస్‌తో కలిసి సిబ్బందిని పూర్తిస్థాయిలో విచారించారు. సదరు మహిలకు అందించిన బంగారు కమ్మలను స్వాదీనం చేసుకున్నారు. ఒక మహిళా తనకు ఫోన్ చేసి కమ్మలు తీసుకోవాలని, తాను ఎక్కడికి వెళ్ళిన సిబ్బందికి ఇవ్వడం జరగుతుందంటు చెప్పటంతో సదరు మహిళా నాకు వద్దు అంటు చెప్పినప్పటికి పదే పదే తీసుకోవాలంటు ఒత్తిడి తీసుకు వచ్చినట్లు తేటతెల్లం చేయటంతో అంతా అవాక్కయ్యారు. రికార్డు ఎందుకు చేశావు అంటు మీడియా అడగగా మొదటి రోజు కమీషనర్ ప్రవర్తన అసభ్యంగా ఉందని, అందుకే బయపడ్డామని తెలిపారు. దీంతో ఫోన్ చేసిన విషయాన్ని రికార్డు చేశామన్నారు. ఈ కమీషనర్ వ్యవహారం మరో నిత్యానందస్వామి వ్యవహారంలా ఉందంటు చొప్పదండిలో చర్చనీయాంశమైంది. సిబ్బందితో జరిపిని విచారణను పూర్తిస్థాయిలో ఆర్‌డిఒ రికార్డు చేశారు. అనంతరం మీడియాతో ఆర్‌డిఒ మాట్లాడుతు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాను విచారణకు వచ్చానని, పూర్తిస్థాయిలో సిబ్బందిని విచారించామని, అంతా రికార్డు చేశామని తెలుపుతూ సదరు మహిళకు ఇచ్చిన బంగారు కమ్మలు తెప్పించామని మీడియా ముందు ఉంచారు. సమగ్ర విచారణ రిపోర్టును కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు.
చిత్రం..సిబ్బందిని విచారిస్తున్న ఆర్‌డిఒ ఆనంద్‌కుమార్