తెలంగాణ

గుజరాతీలకు పూర్తి భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో గుజరాత్ సమాజ్ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడం సంతోషకరమని, హర్షణీయమని టీఆర్‌ఎస్ నేత, తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ నేతృత్వంలో గుజరాత్ సమాజ్ సభ్యులు భారీ ఏత్తున ఆదివారం కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే గుజరాత్ సమాజ్ సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణేతరులకు భద్రత ఉండదంటూ కొంత మంది ప్రచారం చేశారని ఆరోపించారు.
ప్రజలందరికీ భద్రత కల్పించామని, గత నాలుగున్నర ఏళ్లలో ఒక్క రోజు కూడా హైదరాబాద్‌లో కర్ఫ్యూ విధించలేదన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఐదు లక్షల సీసీ కెమెరాలను అమర్చామని, మరో ఐదు లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం పూర్తయితే నేరాల సంఖ్య మరింత తగ్గుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారి అవసరాల కోసం హైదరాబాద్‌లో రెండు భారీ రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. గుజరాత్ కంటేటే టీఎస్-ఐపాస్ విధానం బాగుందన్నారు. గత నాలుగేళ్లలో విద్యుత్ సరఫరా మెరుగు చేశామని, కోత లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, పరిశ్రమలకు కూడా కోత లేకుండి కరెంట్ ఇస్తున్నామన్నారు.
టీఆర్‌ఎస్ గుర్తు కారు గుర్తని, దీని డ్రైవర్ కేసీఆర్ అని గుర్తు చేస్తూ, ఈ కారు వేగంగా వెళుతోందని, ఈ వేగాన్ని ఆపకూడదని, డ్రైవర్‌ను మార్చకూడదన్నారు. ప్రతి గుజరాతీ పారిశ్రామిక వేత్త తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసేలా చెప్పాలని కోరారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం తధ్యమని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చైర్మన్ కోలేటి దామోదర్ స్వాగతోపన్యాసం చేశారు.

చిత్రం..ఆదివారం కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్న గుజరాత్ సమాజ్ సభ్యులు