తెలంగాణ

మైనారిటీ సబ్‌ప్లాన్ కాంగ్రెస్‌తోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: మైనార్టీ సబ్‌ప్లాన్ అమలుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముస్లిం నేతలకు భరోసా ఇచ్చారు. ఆదివారం నాడు అబుల్ కలామ్ అజాద్ జయంతి వేడుకల సందర్భంగా టీపీసీసీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కథ్రియ హోటల్ జరిగిన సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు. మైనార్టీ నేతల నుద్ధేశించి ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణలో దుర్మార్గ పాలన సాగుతోందని ఆయన ధ్వజదెత్తారు. గత ఎన్నికల సమయంలో మైనార్టీలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ తీసుకువస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నాలుగేళ్ళు గడిచినా పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు. ఉర్దూ బాషను రెండవ భాషగా తీసుకువస్తానని చెప్పి ఇంతవరకు ఎలాంటి పురోగతి చేయలేదన్నారు. ముస్లింలను అన్నింటా మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌కే దక్కిందన్నారు. తన వారసున్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టడానికి ముందస్తు ఎన్నికలకు సిద్ధం అయ్యారని, అయితే ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ నావ మునిగిపోవడం ఖాయమని ఆయన నొక్కి చెప్పారు. బిజెపి మతతత్వ పార్టీ పాలన సాగిస్తోందని అందుకు కేసీఆర్ మద్దత్తు పలుకుతున్న విషయం ఆయన మాటల్లో కన్పిస్తోందని అన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో పోలింగ్ బూత్‌ల వారిగా పార్టీని బలోపేతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ సోహెల్, జాతీయ విద్యార్థి నాయకులు కన్నయ్య కుమార్, అఖిల భారత కాంగ్రెస్ మైనార్టీ విభాగం చైర్మన్ అమీర్ జావిద్, మాజీ కేంద్ర మంత్రి, ఎఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా, రాజ్యసభ సభ్యులు నజీర్ హుసేన్, సలీమ్ అహ్మద్, బోసురాజు, అధికార ప్రతినిధి నిజముద్దీన్, నాసీర్ హుసేన్రు పాల్గొన్నారు.

చిత్రం..టీపీసీసీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో జరిగన సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి