తెలంగాణ

టీఆర్‌ఎస్‌కే మళ్లీ అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 12 : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ వందసీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని.. గులాబీ జెండా పేద ప్రజలకు అండ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో దళితుల ఆశీర్వాద సభ లో మంత్రి హరీష్‌రావు హాజరై మాట్లాడారు. కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫారం తీసుకొని మీ ఆశీర్వాదం తీసుకొని వచ్చినట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే సొంతగా ఖాళీ స్థలం ఉన్న ఇళ్లు నిర్మించుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా అందచేయనున్నట్లు పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు అర్హులైన దళితులకు కేటాయించేందుకు కృషిచేస్తానన్నారు. సిద్దిపేటలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయటంతో పాటు, రెండు గురుకులాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నియోజక వర్గాల్లోని అన్ని కుల సంఘాల ప్రజలు ఆశీర్వాద సభలు నిర్వహించటంపై ఏంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సహాయ సహాకారాలు అందిస్తానన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు. జడ్పీవైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ యాదయ్య, నాయకులు గ్యాదరి రవీందర్, సాకి ఆనంద్, ముత్యాల కనకయ్య, నమూండ్ల రాంచంద్రం, బాల్‌లక్ష్మి, సువర్ణ పాల్గొన్నారు.

చిత్రం..దళితుల ఆశీర్వాద సభలో డప్పు కొడుతున్న మంత్రి హరీష్‌రావు