తెలంగాణ

ముందస్తుతో రూ.వెయ్యి కోట్లు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 12: బంగారు తెలంగాణ అంటూ... ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. నాలుగేన్నర ఏళ్లకే పలాయనం ఎందుకు చిత్తగించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌పై ఏంతో నమ్మకంతో ప్రజలు స్పష్టమైన మెజార్టీతో అధికారం కట్టబెడితే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నాలుగున్నర ఏళ్లకే ముందస్తు ఎన్నికలకు తెరలేపిన కేసీఆర్... రాబోయే రోజుల్లో అధికారం ఇస్తే.. మళ్లీ పలాయనం చిత్తగించడని గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. ముందుస్తు ఎన్నికల పేరుతో వేల కోట్ల ప్రజాధనం వృధాకు తెరతీసీన కేసీఆర్ గత నాలుగున్నర ఏండ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చాడని విమర్శించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నియోజకవర్గం బూత్ కమిటీల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీని ఇవ్వటంతో పాటు పలు స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లు వేసి గెలిపించారని, అయితే వారంతా చివరికి టీఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ప్రజల కోసం పనిచేస్తున్నది కేవలం బీజేపీ మాత్రమే అన్నది గమనించాలన్నారు. సిద్దిపేట అంటేనే భయమైన వాతావరణాన్ని సృష్టించే యత్నాన్ని టీఆర్‌ఎస్ చేస్తోందన్నారు. ఇక్కడ ఉండే టీఆర్‌ఎస్ నాయకులు ఎవరైనా సరే ఉండాలంటే టీఆర్‌ఎస్‌లో ఉండాలని, లేదంటే ఇతర పార్టీలో ఉంటే కోవర్టుగా పనిచేయాలనే వాతవారణాన్ని కల్పిస్తున్నారన్నారు.
సిద్దిపేటలో సినీమా సెట్స్ మాదిరిగా, నిర్మించిన డబుల్ బెడ్ రూంలకు ఆశ చూపుతూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో దొంగలుగా ఉన్నవారి ఫోటోలు పోలీస్‌స్టేషన్, బస్‌స్టేషన్‌లో ఉండేవని, ఇప్పుడు ఎక్కడని ఒక్కసారి ఆలోచిస్తే వారంత టీఆర్‌ఎస్‌లో కన్పిస్తారని, దొంగలు కాస్తా కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారని ఆరోపించారు. సామాన్య కార్యకర్త ప్రధాని కాగల ఏకైక అవకాశం బీజేపీ పార్టీలో ఉందన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బీజేపీది ఒక్కటే మంత్రమని, అది భారత్‌మాతకు జై అన్నారు. రాష్ట్రంలో మార్పురావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. 2022 నాటికి ప్రతి నిరుపేదకు, సొంతిళ్లు ఉండాలన్నదే మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం మోదీ నిధులు కేటాయిస్తే ఇతర అవసరాలకు వినియోగించి, మాయం చేసిన టీఆర్‌ఎస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ కూటమికి ఓటేస్తే తెలంగాణకు చంద్రగ్రహణం పట్టనుందని జోస్యం చెప్పారు. బీజేపీ అభ్యర్థి నాయని నరోత్తంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే దోచేస్తారు
నాగర్‌కర్నూల్ : దేశంలో మూడు రాష్ట్రాలు మినహా కాంగ్రెస్ ఎక్కడా అధికారంలో లేదని ఈ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారమిస్తే కాంగ్రెస్ నాయకులు దోచేస్తారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు. సోమవారం స్థానిక ఓ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ నియోజకవర్గ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలని, ఏమరుపాటుతో ఉంటే ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందన్నారు. కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు ఈ నలుగురే నిర్ణయాలు తీసుకుంటారని అందుకేనా సుదీర్ఘ పోరాటం చేసి 1200 మంది ఆత్మబలిదానం చేసుకున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని, దళితులకు మూడు ఎకరాల భూమిని అమలుచేయలేదని, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరగలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 70వేల ఇళ్ల నిర్మాణానికి రూ.190 కోట్లు మంజూరు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం నిద్రపోయిందని, ఇళ్లు కూడా నిర్మించలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. మోదీకి కుటుంబంలేదని, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీలు కుటుంబ పాలనకు అలవాటు పడ్డారన్నారు. అభివృద్ధే నినాదంగా మోదీ దేశ హితాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పేదవానికి ఇల్లు, కరెంటు, తాగునీరు, గ్యాస్ సిలిండర్, ఉపాధి కల్పించాలని దృక్ఫథంతో, 8 కోట్ల మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, 4 కోట్ల కుటుంబాలకు సౌభాగ్య పథకం కింద ఉచిత కరెంటు, కోటి ఇళ్లు నిర్మించడానికి పథక రచన చేయగా, 56 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, వచ్చే ఏప్రిల్ నాటికి మిగతా వాటిని పూర్తి చేస్తామన్నారు.

చిత్రం..నియోజకవర్గం బూత్ కమిటీల సమావేశంలోమాట్లాడుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు