తెలంగాణ

వరంగల్ కాంగ్రెస్‌లో లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 12: వరంగల్ పశ్చిమ గెలిచే సత్తా కాంగ్రెస్‌కే ఉందని కార్యకర్తలు హన్మంతరావును నిలదీశారు. వరంగల్ నగరంలోని అతి కీలకమైన వరంగల్ పశ్చిమ సెగ్మెంట్‌ను మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. నియోజకవర్గంలో టీడీపీ బలం ఎప్పుడో తుడుచు పెట్టుకుపోయందని.. కనీసం కార్యకర్తలు, నాయకులు కూడా లేరని అలాంటప్పడు ఆ పార్టీకి ఈ నియోజకవర్గాన్ని ఎలా కేటాయిస్తారంటూ కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వరంగల్ పశ్చిమ టికెట్‌ను దాదాపు ఖరారు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం నుండి డీసీసీ భవన్‌లో ఆమరణ నిరహార దీక్షకు దిగారు. కార్యకర్తల ఆందోళనను తెలుసుకున్న మాజీ ఎంపీ హన్మంతరావు హుటాహుటిన వరంగల్ డీసీసీ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలంతా ఒక్కసారిగా విహెచ్‌పై విరుచుకపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా కంటికి రెప్పాలా కాపాడుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి టికెట్ ఇవ్వకుండా కూటమి పొత్తులో భాగంగా టీడీపీకి ఇవ్వడం దారుణం అని జిల్లా కార్యదర్శి సయ్యద్ రజాలి విహెచ్‌తో వాగ్వాదానికి దిగారు. అయితే, కార్యకర్తల బాధను తాను అర్థం చేసుకుంటానని.. ఎట్టి పరిస్థితిలో వరంగల్ పశ్చిమ టికెట్ రాజేందర్‌రెడ్డికి వచ్చేలా తన వంతు కృషి చేస్తానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఆందోళన విరమించాల్సిందిగా కోరారు.
ఈ విషయంపై తాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలసి ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కార్యకర్తలంతా కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సునాయాసంగా కాంగ్రెస్ గెలిచే వరంగల్ పశ్చిమ టికెట్‌ను టీడీపీకి ఇవ్వడాన్ని పునరాలోచించాలని కార్యకర్తలు కోరారు. అదే విధంగా కాకతీయ యూనివర్సిటీ గేటు వద్ద నాయిని రాజేందర్‌రెడ్డికే టికెట్ కేటాయించాలని ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. విద్యార్థులు చేపట్టిన ధర్నాకు వీహెచ్ సంఘీభావం ప్రకటించారు.
చిత్రం..వీహెచ్‌ను వేడుకుంటున్న కార్యకర్తలు