తెలంగాణ

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెంలగాణ ప్రాం తంలో పోటీ చే స్తామని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో కంటే ప్రజాసమస్యల పరిష్కారంపైనే తాము దృష్టిసారించామని, ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు గడువు ఉందని అనుకుంటే అకస్మాత్తుగా కేసీఆర్ శాసనసభను రద్దు చేశారని పవన్ చెప్పారు. అకస్మాత్తుగా అసెంబ్లీ రద్దు కావడంతో తెలంగాణ ఎన్నికల్లో తాము పోటీ చేయలేని పరిస్థితి నెలకొందని అన్నారు. తెలంగాణలో ఇప్పటి నుండే రానున్న లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని, ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గడవు ప్రకారం జరిగితే ఎక్కడ పోటీ చేయాలనేదానిపై ప్రణాళిక రూపొందించుకున్నామని, కాని మొత్తం వ్యవహారం మారిపోయిందని అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.