తెలంగాణ

అంగరంగ వైభవంగా గ్రామీణ సినిమా పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రామీణాభివృద్ధిపై మూడవ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డి అండ్ పిఆర్ లో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. చిన్న సినిమాలు, డాక్యుమెంటరీలు, మొబైల్ ఫిల్మ్‌మేకింగ్ పోటీలు, ప్యానెల్ చర్చలు ప్రారంభోత్సవం రోజు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు భారీ ఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. రెండురోజుల పాటు జరిగే ఈ పండగను ఎన్‌ఐఆర్‌డి అండ్ పిఆర్ డైరెక్టర్ జనరల్ డబ్ల్యుఆర్ రెడ్డి తదితరులు జ్యోతివెలిగించి ప్రారంభించారు. యువ చిత్ర నిర్మాతలను వారి ప్రతిభను ప్రదర్శించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు వెలుగులోకి తీసుకువచ్చేందుకు డాక్యుమెంటరీ చిత్రాల ఆధారంగా ప్రజల మనోభావాలను ప్రచారంలోకి తీసుకువచ్చేందుకు ఈ వేదిక ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మొబైల్ చిత్ర నిర్మాణంలో పోటీ నిర్వహించారు. ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్‌ఐఆర్‌డి అండ్ పీఆర్ డైరెక్టర్ జనరల్ డబ్ల్యుఆర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధికి సృజనాత్మకతను ఉపయోగించుకునేందుకు ఫిల్మ్‌ఫెస్టివల్ దోహదపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల విజయ గాధలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు సినిమా మాధ్యమం బాగా ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియచేసేందుకు సినిమాలు దోహదపడతాయని ఎన్‌ఐఆర్‌డి అండ్ పీఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాధికా రస్తోగి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు డాక్యుమెంటరీలు ఉపయోగపడతాయని పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) డైరెక్టర్ భూపేంద్ర కైన్తోల తెలిపారు. ఎన్‌ఐఆర్‌డి అండ్ పీఆర్‌తో కలిసి తమ సంస్థ ఈ దిశలో పనిచేస్తుందన్నారు.
ఈ సందర్భంగా ‘పట్టణ-గ్రామీణాభివృద్ధికి సినిమాలు’ అన్న అంశంతో పాటు నిజజీవితంలో మహిళల పాత్ర అన్న అంశంపై ప్యానెల్ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్యానలిస్టులను సన్మానించారు. లోక్‌సభ టీవీ సంపాదకుడు శ్యామ్ కిషోర్ సహారు, విజ్ఞాన్ ప్రొఫెసర్ నిమిష్ కపూర్, వౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఐఎంసీ డైరెక్టర్ రిజ్వాన్ అహ్మద్ తదితరులు ప్రారంభోత్సవ సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం..గ్రామీణాభివృద్ధిపై 3 వ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న దృశ్యం