తెలంగాణ

కూటమిలో తేలని లెక్క..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: టీఆర్‌ఎస్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయం వరకూ సర్దుబాట్లపై స్పష్టత లేక గందరగోళం నెలకొంది. కూటమిలోని భాగస్వామ్యపక్షాల మధ్య అనైక్యత కనిపించింది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, తెలంగాణ జన సమితి పార్టీలకు సీట్ల సర్దుబాట్ల విషయంలో స్పష్టత ఇవ్వలేకపోయింది. మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించిన స్థానాల్లో మినహా, మిగతా మూడు పార్టీలు కొన్ని స్థానాల్లో పరస్పరం పోటీగా నామినేషన్లు దాఖలు వేయించాయి. కాంగ్రెస్సే మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లకు బీ-్ఫరాలు అందజేయడంతో భాగస్వామ్యపక్షాల నేతలు షాక్ తిన్నారు.
మొత్తం 119 నియోజకవర్గాల్లో 25 స్థానాలను మిత్రపక్షాలైన టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు కేటాయించడంతో, కాంగ్రెస్ 94 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సి ఉండగా, టీజేఎస్‌కు కేటాయించిన వరంగల్ తూర్పు, దుబ్బాక, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించి ‘బీ-్ఫరాలు’ అందజేసింది. టీడీపీకి కేటాయించిన ఇబ్రహీంపట్నం విషయంలోనూ కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇబ్రహీంపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా సామ రంగా రెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగా రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా పటాన్‌చెరు నుంచి కాటా శ్రీనివాస్‌తో నామినేషన్ దాఖలు చేయించింది. టీజేఎస్‌కు కేటాయించిన దుబ్బాక నుంచి మద్దుల నాగేశ్వర్ రెడ్డికి, వరంగల్ తూర్పు నుంచి వద్దిరాజు రవిచంద్ర, మిర్యాలగూడ నుంచి ఆర్.కృష్ణయ్యను బరిలోకి దించింది. ఇదేమిటని టీడీపీ, టీజేఎస్ నేతలు కాంగ్రెస్‌ను ప్రశ్నించగా, స్నేహపూర్వక పోటీ అని చల్లగా చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ వైఖరిని టీడీపీ, టీజేఎస్ నేతలు తూర్పారపడుతున్నారు.
కాంగ్రెస్ వర్సెస్ టీజేఎస్
మిర్యాలగూడ: కాంగ్రెస్ అభ్యర్థి-పటోళ్ళ ఉపేందర్ రెడ్డి, టీజేఎస్-జనార్థన్ రెడ్డి. దుబ్బాక: కాంగ్రెస్-నాగేశ్వర్ రెడ్డి, టీజేఎస్-రాజ్‌కుమార్, వరంగల్ తూర్పు: కాంగ్రెస్-గాయత్రి రవిచంద్ర, టీజేఎస్-గాదె ఇన్నయ్య, అసిఫాబాద్: కాంగ్రెస్-ఆత్రం సక్కు, టీజేఎస్-విజయ్, ఖానాపూర్: కాంగ్రెస్-రమేశ్ రాథోడ్, టీజేఎస్-్భంరావు, చెన్నూరు: కాంగ్రెస్-నేతకాని వెంకటేశం, టీజేఎస్-నరేష్.