తెలంగాణ

అభివృద్ధికి టీఆర్‌ఎస్ అవరోధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ పథకాలకు, కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తోందని, అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. సోమవారం నాడాయన హైదరాబాద్‌లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ముషీరాబాద్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దేశంలో అనూహ్యమైన ప్రగతి సాధించగలిగామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 కోట్ల మేర మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, 5,27,746 గ్రామాలు బహిర్భూమి లేని గ్రామాలుగా ప్రకటించడమైందని అన్నారు. అలాగే 530 జిల్లాలు బహిర్భూమి లేని ఒడిఎఫ్ జిల్లాలుగా రూపొందాయని అన్నారు. దేశంలో 96.21 శాతం ఇళ్లకు మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయని, మహిళలు గర్వపడే రోజు వచ్చిందని అన్నారు. 2014లో మరుగుదొడ్ల శాతం 38.70 మాత్రమేనని అన్నారు. ఆర్ధిక రంగం, పరిస్థితులను మెరుగుపరచడం, వ్యాపారాలు తేలికగా చేసుకోగలగడం, ప్రశాంతంగా అంతా జీవించగలగే వాతావరణాన్ని బీజేపీ తీసుకువచ్చిందని అన్నారు. దేశంలో యువతకు అనేక అవకాశాలు కల్పించామని, వినూత్న ప్రయోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అలాగే దేశీయంగా అన్నీ తయారుచేసుకునేలా మేకిన్ ఇండియా, స్టార్టప్ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని అన్నారు. కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించామని, అన్ని రంగాల్లో కనెక్టివిటీని తెచ్చామని అన్నారు. రహదార్ల నిర్మాణం, హైదరాబాద్‌లో మెట్రో నిర్మాణం, మిగిలిన ప్రాంతాల్లో జల మార్గాలు కూడా ఏర్పాటు చేయడమైందని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతూనే రహదారుల కనెక్టివిటీని పెంచామని చెప్పారు. మూడు దశాబ్దాల్లో నిర్మించిన రోడ్లకు రెట్టింపు రోడ్లను నాలుగేళ్లలో నిర్మించామని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడారు. కేంద్ర మంత్రి చేతులు మీదుగా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సమరానికి సిద్ధం కావడానికి ఈ కార్యాలయం కేంద్రంగా మారిందని అన్నారు. కార్యకర్తలు వ్యూహాత్మకంగా ప్రధాని నరేంద్రమోదీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. పేదలకు ప్రవేశపెట్టిన పథకాలు, వాటి ద్వారా అందుతున్న ఫలాలను చెప్పాలని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుస్తున్న ఏకైక పార్టీ బీజేపీయేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కట్టా సుబ్రహ్మణ్యం, వెదిరెశ్రీరాం, ఓఎస్‌రెడ్డి, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ముషీరాబాద్‌లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న జేపీ నడ్డా