తెలంగాణ

ఒక్క హామీ నెరవేర్చలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: మహాకూటమి అధికారంలోకి వస్తే క్రైస్తవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీటీడీపీ అధినేత ఎల్ రమణ పేర్కొన్నారు. మంగళవారం నాడు ఎన్టీఆర్ భవన్‌లో సికింద్రాబాద్‌కు చెందిన డేవిడ్ శాంతరాజు ఆధ్వర్యంలో క్రైస్తవ మత బోధకులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో నయానవాబును గద్దె దించడానికి తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. పదే పదే చంద్రబాబు ప్రాజెక్టులను అడ్డుకున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఏ ప్రాజెక్టు ఆగిందో కేసీఆర్ చెప్పాలని అన్నారు. ఎగువ రాష్ట్రాల వల్ల సమస్యలు ఉంటే వాటిని సీడబ్ల్యుసీ , కేంద్ర జలవనరుల శాఖ, ట్రిబ్యునల్స్, కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు, న్యాయస్థానాలు ఇలా అనేక వ్యవస్థలు ఉన్నాయని, వాటి ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ఇంత కాలం వౌనంగా ఉండి, ఇపుడు ఎన్నికల సమయం ఆసన్నమయ్యే సరికి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని ప్రజల్లో లేని పోని అనుమానాలను, విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఆగలేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చలేదని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ, మూడెకరాల భూమి పంపిణీ, లక్ష ఉద్యోగాల భర్తీ, కేజీ టు పీజీ కార్యక్రమం, గిరిజనులకు మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని నిలదీశారు. ఏదైనా ప్రాజెక్టు పనులు నిలిచిపోయి ఉంటే దానికి కారణం టీఆర్‌ఎ అసమర్థత మాత్రమేనని అన్నారు.ఈ సందర్భంగా పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అనేక జాతీయ భావాలున్నాయని, ప్రజాస్వామ్యానికి, సంక్షేమ కార్యక్రమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిందని అన్నారు. కర్ఫ్యూ ఉన్న హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలా ప్రజలంతా సహజీవనం సాగించేలా జీవన వాతావరణాన్ని చంద్రబాబునాయుడు కల్పించారని చెప్పారు. మరో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్రమోదీ కి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీనీ, కేసీఆర్‌నూ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని అన్నారు. డైవిడ్ శాంతరాజు మాట్లాడుతూ క్రైస్తవ భవన్‌కు ఇంతవరకూ స్థలం చూపలేదని అన్నారు.
టీడీపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా
టీడీపీ స్టార్ క్యాంపెయినర్లుగా 19 మందిని నియమించింది. అందులో ఎల్ రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, టీ దేవేందర్ గౌడ్, రేవూరి ప్రకాష్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, పెద్దిరెడ్డి, అరవిందకుమార్ గౌడ్, మండవ వెంకటేశ్వరరావు, లక్ష్మణ్ నాయక్ రమావత్, పాల్వాయి రజనీ కుమారి, ఎండీ యూసుఫ్, గుళ్లపల్లి బుచ్చిలింగం, ఈగమల్లేశం, నన్నూరి నర్సిరెడ్డి, నల్లూరి దుర్గాప్రసాద్, పీ సాయిబాబా, టీ వీరేందర్ గౌడ్, బొట్ల శ్రీనివాస్, ఎండీ తాజుద్దీన్ ఉన్నారు.