తెలంగాణ

టీఆర్‌ఎస్‌తోనే మైనార్టీల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందని ఎంఐఎం జాతీయ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం రాత్రి జిల్లా కేంద్రమైన నిర్మల్ గంజ్‌బకష్ మైదానంలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల సమావేశానికి అసదుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషిచేశారన్నారు. ముఖ్యంగా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లు, షాదీముబారక్ పథకాల ద్వారా ఎంతోమంది పేద ముస్లింలకు లబ్ధి చేకూరుతుందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కన్నా తెలంగాణలోనే శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. మంచి పనులు చేసే నాయకులకు ఓట్లువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. నిర్మల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గెలుపుకోసం కృషిచేయాలని పరోక్షంగా పిలుపునిచ్చారు.
ప్రచారానికి రావద్దంటూ..రూ.25 లక్షల ఆఫర్
తనను నిర్మల్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి రావద్దని కోరుతూ మధ్యవర్తుల ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి తనకు 25 లక్షల రూపాయలను ఇవ్వచూపారని అసదుద్దీన్ ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు కూడా తనవద్ద ఉన్నాయని, తాను ఇలాంటి ఆఫర్లకు ప్రాణంపోయినా లొంగబోనన్నారు.
ఎంఐఎం టీఆర్‌ఎస్‌తో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగిస్తోందని, ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చేది లేదన్నారు. ముస్లిం మైనార్టీలు టీఆర్‌ఎస్ వెంటే నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే అసదుద్దీన్ ఒవైసీ నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డిపై చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ అజింబిన్ యాహియా, పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.