తెలంగాణ

పార్టీ టికెట్లను ఉత్తమ్ అమ్ముకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టికెట్లను అమ్ముకున్నాడని పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు మంగళవారం మెదక్‌లో ఆరోపించారు. సోమవారం తాను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంట్లో ఉన్నానని, ఐదు నిమిషాల్లో బీ ఫారం అందజేస్తానని ప్రకటించి తనకన్నా డబ్బు అధికంగా చెల్లించిన పట్లోళ్ల ఉపేందర్‌రెడ్డికి ఆయన టికెట్ ఇచ్చారని సుప్రభాతరావు ఆరోపించారు. దీంతో మెదక్ నియోజకవర్గంలో మహాకూటమి గందరగోళంగా మారింది. కాంగ్రెస్ టికెట్ ఆశించిన పీసీసీ కార్యదర్శి బట్టి జగపతి, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మ్యాడం బాలకృష్ణ, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పట్లోళ్ల ఉపేందర్‌రెడ్డికి చివరి క్షణంలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంలో అవాక్కయ్యారు. ఇందులో తనకే టికెట్ వస్తుందని మ్యాడం బాలకృష్ణ ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. మహాకూటమిలో టీజేఎస్ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి బి ఫారం మీద నామినేషన్ దాఖలు చేశారు. ఈయన నామినేషన్ దాఖలు చేసిన ఒక గంట వ్యవధిలో ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్ బి ఫారం మీద నామినేషన్ వేయడంతో గందరగోళంలో పడ్డారు.
బరిలో ఉంటాను: ఎన్‌సీపీ అభ్యర్థి శశిధర్‌రెడ్డి
రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా బరిలో ఉంటానని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ప్రకటించారు. తన తమ్ముడు ఉపేందర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ బి ఫారం ఇచ్చారని, దాంతో ఉపేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయాన్ని దృష్టికి తెగా తన తమ్ముడు ఉపేందర్‌రెడ్డి 2007లోనే నాకు దూరమయ్యాడని శశిధర్‌రెడ్డి తెలిపారు. అంటే ఉపేందర్‌రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎందరు అడ్డుపడినా తెరాస చేసిన అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించి ఈ ఎన్నికల్లో తనను ప్రజలు గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన ర్యాలీలో కర్షకులు, కూలీలు వేల మంది పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాంటి ప్రజలను తెరాసకు బలిపశువును చేయలేనన్నారు.