తెలంగాణ

61 నామినేషన్ల తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 20: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 317 మంది అభ్యర్థుల నామినేషన్లకుగాను 61 మంది అభ్యర్థుల నామినేషన్లు మంగళవారం నాటి పరిశీలనలో తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 256 మంది అభ్యర్థుల నామినేషన్లకు సక్రమంగా ఉన్నాయని తేల్చారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటి వరకు గడువు ఉండగా, పలు నియోజవర్గాల్లో ఒకే పార్టీ నుండి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణకు వారితో పార్టీలు బుజ్జగింపుల పర్వానికి తెరలేపాయి.
నల్లగొండ నియోజకవర్గంలో 26 మంది అభ్యర్థుల నామినేషన్లలో ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సూర్యాపేట నియోజకవర్గంలో 30 మంది అభ్యర్థులకుగాను ఒకరి నామినేషన్ తిరస్కరించబడింది. కోదాడ నియోజకవర్గంలో 27 మంది నామినేషన్లకుగాను ఐదుగురి, మిర్యాలగూడలో ఇద్దరి నామినేషన్ల తిరస్కరించబడగా 43 మంది నామినేషన్లు ఆమోదించారు.