తెలంగాణ

రైతును రారాజు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 20: ‘తెలంగాణలో రైతుల గోస తెలిసిన నేను కాపు బిడ్డనే.. రైతును రాజుగా చూడాలన్నదే టీఆర్‌ఎస్ సర్కార్ లక్ష్యమని’ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించేందుకే ఐకేపీ మహిళ సంఘాల ద్వారా పుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పుడ్‌ప్రాసెస్ యూనిట్లు ఏర్పాటు చేసి, కల్తీలేని నాణ్యమైన ఆహారపదార్థాలను అందించటమే ధ్యేయమన్నారు. మంగళవారం సిద్దిపేట-దుబ్బాక నియోజక వర్గాల ఎన్నికల ప్రచారసభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో 70 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. చరిత్రలో ఊహించని విధంగా అధికారులు రైతుల వద్దకు వచ్చి పట్టా పాస్ పుస్తకాలు అందచేశారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పంట కాలనీలుగా మార్చి, రైతులు పండించిన పంటలకు మంచి డిమాండ్ వచ్చేలా కృషిచేస్తామన్నారు. వ్యవసాయ శాస్తవ్రేత్తలు సూచనల మేరకు పంటకాలనీలు ఏర్పాటు చేసుకుంటే ప్రతి పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. నియోజకవర్గంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తాయన్నారు. రైతుబంధు ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎకరానికి 8వేలు చెల్లించామని, వచ్చే ఏడాది నుండి ఎకరాకు 10వేల రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ముంబయిలోని మురికివాడ దారావీలో ఓ మహిళ నెలకొల్పిన లిజ్జత్ పాపడ్ దేశంలో రూ.1176 కోట్ల టర్నోవర్ చేస్తున్నారన్నారు. భవిష్యత్‌లో పుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లలో తయారైన కల్తీలేని ఆహార పదార్థాలను రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీంతో రేషన్‌డీలర్లను బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐకేపీ ఉద్యోగులను పుడ్‌ప్రాసేసింగ్ యూనిట్లలో పర్మినెంట్ ఉద్యోగులుగా మారుస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పాలన చేతకాదని, కరెంటు, నీరు ఉండదని, రెండేళ్లలో తిరిగి ఆంధ్రాలో కలుపుతారని తప్పుడు ప్రచారం చేశారన్నారు. అందరి అంచనాలను పటాపంచలు చేస్తు తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధిలో దేశంలో నెంబర్‌వన్‌గా ముందుకు పోతుందన్నారు. రైతులకు సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది సాగునీరు వస్తుందని, తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణీగా మారుతుందన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ ఉన్నంత కాలం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేటను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటీకి తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కల్యాణలక్ష్మి పథకంలో పేద యువతుల వివాహానికి లక్షా 116 రూపాయలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవన్ని సాధించేందుకు తాను హరీష్‌రావు, రామలింగారెడ్డిలు కలసి బ్యాంకు దోపీడీలు చేయలేదని, కుంభకోణాల, లంబకోణాలు చేయకుండ, కడుపుకట్టుకొని అవినీతి రహిత పాలన అందించామన్నారు. రాష్ట్రానికి సంపదను పెంచి పేద ప్రజలకు పంచుతున్నామన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్ సర్కార్‌ను ఆశీర్వదించాలని కోరారు. అంతకు ముందు మాజీ మంత్రి ముత్యంరెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.