తెలంగాణ

నేనూ వ్యవసాయదారుడనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, నవంబర్ 20: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభకు హాజరై, తనదైన శైలిలో 16 నిముషాలు మాత్రమే ప్రసంగాన్ని కొనసాగించారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రపంచంలోనే ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేవని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ పథకాలు అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. నేను కూడా ఒక వ్యవసాయ కాపుదానం మనిషినే కాబట్టి నాకు రైతుల కష్టాలు తెలుసని అన్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించిననాడే బంగారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్లని అన్నారు. త్వరలో ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని వ్యవసాయదారులకు 10టీఎంసీల సాగునీరు ఇవ్వబోతున్నామని అన్నారు.
అలాగే ఇదే సెగ్మెంట్‌లోని పోచారం ప్రాజెక్ట్‌కు 160కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ ప్రతి అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రంలో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. వీటి నిర్వహణ సైతం ఐకెపి మహిళలకు, అప్పగించడం జరుగుతోందని ఐకెపి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని అన్నారు. రాష్ట్రంలో కల్తీ సరకుల గొడవ ఎక్కువగా ఉందని, తాగే పాలల్లో కల్తీ జరుగుతోందని కల్తీ నివారణ కోసమే ఈ ఫుడ్‌ప్రాసెసింగ్ విధానం అని అన్నారు. రేషన్ డీలర్ల ద్వారానే పూర్తి సమయంలో నాణ్యమైన సరకులు అందించేలా కృషి చేస్తామని, రేషన్‌డీలర్ల పనితనానికి సరైన ఆదాయం వారికి అందేలా చూస్తామని అన్నారు. వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా తన విధులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సక్రమంగా నిర్వహించి, తన దృష్టిలో ఆయన లక్ష్మీపుత్రునిగా నిలిచారని అన్నారు. అలాగే ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ఉద్యమం నాటి నుండి తన వెంటే ఉన్నాడని, అతన్ని లక్ష మెజార్టీతో ప్రజలు గెలిపించాలని అన్నారు. తన సర్వే ప్రకారం రవీందర్‌రెడ్డి 85శాతం ఓట్లతో విజయం సాధిస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో మళ్లీ వచ్చిన వెంటనే ఆయనకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 70శాతం మంది రైతులు కేవలం వ్యవసాయ రంగంపైనే ఆదారపడి ఉన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నాయకుడు కేశవరావు, అపద్దర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపి బీబీపాటిల్, సీఎం ఓఎస్‌డి దేశ్‌పతిశ్రీనివాస్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్ శ్రీ్ధర్‌శర్మ, డిసిసిబీ చైర్మెర్ గంగాధర్ పట్వారి, ఉమ్మడి జిల్లాల జడ్పీచైర్మెన్ ధపేదార్‌రాజుతో పాటు భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

చిత్రం.. సభకు హాజరైన జనం