తెలంగాణ

మానసిక సంఘర్షణలో కడియం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 21: అపద్ధర్మ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి టీఆర్‌ఎస్‌లో మానసిక సంఘర్షణకు గురవుతున్నాడని, ఆయన ప్రభుత్వంలో నామ్‌కే వాస్తే డీప్యూటీ సీఎం పదవిలో ఉన్నారని టీడీపీ వరంగల్ పశ్చిమ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ జన్మనిచ్చిన టీడీపీపై కడియం శ్రీహరి విమర్శలు చేయడం తగదని అన్నారు. ఆయన ఆత్మసాక్షిగా కారుగుర్తుకు ఓటు వేస్తారా? అంటూ ప్రశ్నించారు. వివిధ కారణాల వల్ల టీడీపీని వదలి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకుంటామని అయితే అందుకు డిసెంబర్ 6వరకు డెడ్‌లైన్ ప్రకటించారు. తాను అమరావతి నుండి దిగుమతి అయ్యానంటూ కడియం శ్రీహరి చేసిన వాఖ్యాలను రేవూరి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఏర్పాటు అయిన ప్రజా కూటమిని విష కూటమిగా కడియం శ్రీహరి అభివర్ణించారని ఆయన తప్పుబట్టారు. 2009లో ఏర్పాటు అయిన మహాకూటమిలో టీఆర్‌ఎస్ భాగస్వామ్యం అయిన విషాయాన్ని మర్చిపోవద్దన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తోడెళ్లలాగా రాష్ట్రాన్ని దొచుకుంటుందని విమర్శించారు. వరంగల్ పశ్చిమ టీఆర్‌ఎస్ అభ్యర్థి తనపై చేసిన వాఖ్యాలను తీవ్రంగా ఖండించారు. ఆయన తాటాకు చప్పులకు ఎవ్వరు భయపడరని ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. తాను నర్సంపేటలో అప్పట్లో ఒంకార్‌కే భయపడలేదని అన్నారు. గత మూడు సార్లు నర్సంపేట ఎమ్మెల్యేగా అక్కడి ప్రజలకు మచ్చలేని పాలనను అందించానని తాను ఈ నియోజకవర్గం నుండి ఎన్నికైతే నియోజకవర్గంలో భూకబ్జాలకు తావులేకుండా సేవలందిస్తానని అన్నారు. ఇప్పటివరకు ఎవ్వరైన బాధితులు ఉన్నట్లైతే వారికి కూడా న్యాయం చేస్తానని హామి ఇచ్చారు. ప్రజల ఆస్తులు పరిరక్షించేందుకు తన ప్రాణాలు సైతం లెక్కచేయనని అన్నారు. ఎవ్వరి చరిత్ర ఎంటో ప్రజలు తెలుసుకుని పట్టం కట్టాలని కోరారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో వరంగల్, ఖమ్మం బహిరంగ సభలో ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు పూల్లూరి అశోక్‌కుమార్, మార్గం సారంగం, జాటోతు సంతోష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి