తెలంగాణ

బాబును భుజానికెత్తుకున్న కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, నవంబర్ 21: ఏపీ సీఎం చంద్రబాబునాయుడును తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భుజాల మీద ఎక్కించుకొన్నారని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వంకుట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం మెదక్ సీఎస్‌ఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో చంద్రబాబు పెత్తనం అవసరమా అని ప్రజలను ఆయన ప్రశ్నించారు. ‘అనేక కష్టాలు పడ్డాము, కడుపు కట్టుకున్నాం, వెయ్యి నుంచి 1500 మంది తెలంగాణ కోసం చనిపోయారు. నేను చావు నోట్లోకి వెళ్లి బయటపడ్డాను.. నన్ను ఢీకొనడానికి కాంగ్రెస్ వాళ్లు చంద్రబాబును భుజాల మీద ఎత్తుకుంటున్నారని’ ఆరోపించారు. స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించుకునే సమయంలో చంద్రబాబునాయుడి నాయకత్వం అవసరమా అని పేర్కొన్నారు. ఆయన పెత్తనం వస్తే దరఖాస్తు చేసుకోడానికి విజయవాడ పోవాలన్నారు. కత్తి ఆంద్రోళ్లది పొడిచేవాడు తెలంగాణ వాడని ఆయన చమత్కరించారు. అందువలన ఓటుతో వారిని దెబ్బకొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మెదక్ నియోజకవర్గంలో సర్వే జరిపించాము, 64 శాతం తెరాస వైపు ఉన్నట్లు ఆయన తెలిపారు. జోకర్లు, బోకర్లతో తమకు పోటీ లేదన్నారు. మెదక్ ముద్దు బిడ్డ, నా బిడ్డ పద్మాదేవేందర్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ప్రభుత్వంలో ఆమెకు ఉన్నత స్థానం కల్పిస్తానని కేసీఆర్ ప్రకటించారు. మెదక్‌లో తాను, హరీష్‌రావు కలిసి అభివృద్ధి చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఘణపురం ప్రాజెక్ట్ క్రింద ఉన్న ఎఫ్‌ఎన్ కెనాల్స్ పాత ఆయకట్టును సాధించుకున్నట్లు ఆయన తెలిపారు. హరీష్‌రావు ఆధ్వర్యంలో కాళేశ్వరం పూర్తి చేసుకుంటామని, జూన్ మాసంలో ఆ నీళ్లు మెదక్ వస్తాయని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి కోరిక మేరకు 14 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు. 360 రోజులు హల్దీవాగు ప్రాజెక్ట్ ఎండిపోయే పరిస్థితులు లేవని, తూర్పు గోదావరిలో నీళ్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా కాళేశ్వరం నీళ్లతో సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. నేనూ రైతునే, నా మోటర్లు కూడా కాలిపోయాయి, కాంగ్రెస్, టీడీపీ 60 ఏళ్ల పాలనలో పంటలు ఎండిపోయాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి పరిశ్రమలకు ఇళ్లకు 24 గంటలు కరెంట్ ఇచ్చామని, మోటర్లు కాలడం లేదని ఆయన తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వాటిని ఆయన వివరించారు. హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు సన్నబియ్యం ఇచ్చిన చరిత్ర తెలంగాణదే అన్నారు. రైతుబంధు పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఇప్పుడు ఇస్తున్న ఏడాదికి ఎనిమిది వేల రూపాయలను ప్రభుత్వం వస్తే 10 వేలకు పెంచుతామని ఆయన తెలిపారు. వెయ్యి రూపాయలను 2016, దివ్యాంగులకు 1500 నుంచి మూడు వేలకు పెంచుతామని, నిరుద్యోగ బృతి రూ. 3016 ఇస్తామని ఆయన ప్రకటించారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యాన్ని సంపూర్ణంగా చేస్తామన్నారు. పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ఇందుకు మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి పనిచేయాలని ఆయన కోరారు. పరిశ్రమలు వస్తున్నాయి, మెదక్‌ను జిల్లా కేంద్రం చేశాము, కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. మెడికల్, ఇంజనీర్ కళాశాలలు పెరుగుతాయని తెలిపారు. నా బిడ్డ పద్మ చురుకున, నిబద్ధత కలిగిన లీడర్, పనిచేసే నాయకురాలిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ బంద్ అవుతుంది, మిషన్ భగీరథ పూర్తి దశలో ఉంది, స్వచ్ఛమైన నీటిని అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ కిట్ విజయవంతమైందని, ముస్లింలకు రెసిడెన్షియల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారిలో క్రాంతి విప్లవం రాబోతుందని ఆయన తెలిపారు. కంటి వెలుగు విజయవంతంగా కొనసాగుతోందని, 2019 జనవరిలో కంటి ఆపరేషన్లు జరుగుతాయని, ఈఎన్‌టీ డాక్టర్ల బృందాలు వస్తారని తెలిపారు. ప్రతి పౌరునికీ పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆరోగ్య తెలంగాణను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. కూలిపోయిన కుల వ్యవస్థను పురోగభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 1.10 కోట్ల గొర్రెలు పెరిగాయని, దీంతో యాదవులు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర సంపదను కడుపు, నోరు కట్టుకొని పెంచడం జరిగిందన్నారు. ఇసుక మీద ఆదాయం 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో 9.56 కోట్లు రాగా, నాలుగున్నరేళ్లలో మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు వేల 57 కోట్లు ఆర్జించి ప్రజలకు పంచిపెడుతున్నట్లు తెలిపారు. ఇసుకపై దొంగతనం బంద్, రాజకీయ ప్రమేయం లేదని తెలిపారు. భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ రాజమణి మురళీయాదవ్, మాజీ శాసనసభ్యులు ముత్యంరెడ్డి, కరణం ఉమాదేవి, తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మెదక్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు