తెలంగాణ

అధునాతన కారులో కెటిఆర్ చక్కర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: అమెరికాలోని పలు ప్రాంతాల్లో పర్యావరణ హితమైన టెక్నాలజీని వినియోగించడం ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ని ఆకట్టుకుంది. ఇలాంటి విధానాలను తెలంగాణలో అమలు చేసే విషయమై ఆయన సిలికాన్ వ్యాలీలో పలు సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఈ పర్యటన కోసం కెటిఆర్ ఉపయోగించిన కారు అందరి దృష్టినీ ఆకర్షించింది.
టెస్లా మోడల్ ఎక్స్ ఎలక్ట్రిక్ కారు అమెరికా మార్కెట్‌లోనూ ఓ సంచలనం. 2003లో ప్రారంభమైన టెస్లా కంపెనీ సాంప్రదాయేతర ఇంధన రంగంలో సంచలనం సృష్టిస్తోంది. సిలికాన్ వ్యాలీలో యువ ఇంజనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలో నడుస్తున్న టెస్లా మోటర్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లు వాటిలోని ఫీచర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన టెస్లా మోడల్ ఎక్స్ ఎలక్ట్రిక్ కారు పక్షి రెక్కల ఆకారంలో డోర్లు ఉన్నాయి. కారు ముందు విండ్ షీల్డ్ కూడా పానోరామిక్ వ్యూ ఉండి అన్ని దిక్కులను, ఆకాశాన్ని చూసే సౌకర్యం ఉంటుంది. స్టార్ట్ అయిన నాలుగు సెకండ్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ కారు ప్రత్యేకత. సిలికాన్ వ్యాలీలో జరుగుతున్న పరిశోధనలు, టిహబ్ లాంటి చోట్ల ఔత్సాహిక పరిశోధకులకు ఈ కారు స్ఫూర్తిగా నిలుస్తుందని కెటిఆర్ తెలిపారు.
ప్లాస్టిక్ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న క్లీన్ టెక్ ఇంక్యుబేటర్‌లో అంకుర పరిశ్రమలను మంత్రి పరిశీలించారు. ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారంగా తిరిగి ఉపయోగించే నూతన టెక్నాలజీతో రూపొందించిన ప్లాస్టిక్ గ్లాస్‌లను పరిశీలించారు.

టెస్లా మోడల్ ఎక్స్ ఎలక్ట్రిక్ కారుతో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్