తెలంగాణ పథకాలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగున్నాయని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు అభినందించారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్‌డమ్ శాఖ ఆధ్వర్యంలో లండన్‌లో కన్నుల పండువగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వెంకయ్యనాయుడు, స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. అమరుల బలిదానాలను స్మరించుకుని తెలంగాణను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలని స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. లంబేత్మే మేయర్ సలేర్ జాఫర్, లండన్‌లోని ఇండియన్ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ విజాయ్ వసంత, ఎంపి స్టీఫెన్ టిమ్స్ మిల్టన్ కీన్స్ కౌన్సిలర్ గీత మోర తదితరులు పాల్గొన్నారు. లండన్‌లోని తెలంగాణవాసులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ గీతం ‘జయ జయ హే తెలంగాణ’ గీతాలాపన అనంతరం ప్రొఫెసర్ జయశంకర్, అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న కార్యక్రమాలను అధ్యక్షులు ధన్నంనేని సంతప్ వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్‌డమ్ శాఖ ఉపాధ్యక్షులు సుమన్ బలుమూరి, కె సంతోష్, జువ్వాడి సుష్మ, శ్రావణ్‌రెడ్డి, కిశోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి లండన్‌లో స్వాగతం పలుకుతున్న తెలంగాణ వాసులు