రాష్ట్రీయం

మిషన్ భగీరథకు నిధుల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పథకానికి నిధుల వేటలో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఈ నెల 10 న ఢిల్లీ వెళుతున్నారు. కేంద్ర తాగునీరు, శానిటేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖాధికారులతో ఆయన చర్చలు జరుపుతారు. కేంద్ర తాగునీరు, శానిటేషన్ అదనపు సలహాదారు దినేష్ చౌదరి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరీ బీరేందర్ సింగ్, ఈ శాఖ సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్ ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు మిషన్ భగీరథకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి రోజూ 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి 150 లీటర్ల నీటిని అందించాలన్నది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
మిషన్ భగీరథ (తెలంగాణ వాటర్ గ్రిడ్) ప్రాజెక్టుకు 40,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని తాజాగా అంచనావేశారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఏ విధంగా, ఎంత మేరకు సాయం చేస్తుందన్న అంశంపై అధికారుల స్థాయిలో తొలిదశలో జరుగుతున్న చర్చల్లో భాగంగానే ఎస్‌పి సింగ్ ఢిల్లీ పర్యటన ఉద్దేశమని అధికార వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో తీవ్రవాద ప్రాబల్యం ఉన్న 82 జిల్లాల్లో వౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం ఒక ప్రణాళిక రూపొందించింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా ఎనిమిది జిల్లాలు ఈ ప్రణాళిక పరిధిలో ఉన్నాయి. ఈ మార్గంలో కేంద్రం ఇచ్చే నిధులను కూడా మిషన్ భగీరథ ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో మిషన్ భగీరథ కోసం వార్షిక బడ్జెట్ నుండి 4000 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి తొలిదశలో 6,100 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం పనులు జరుగుతున్నాయి. గోదావరి, దాని ఉపనదుల ద్వారా 34 శతకోటిఘనపుటడుగుల నీరు (టిఎంసి), కృష్ణా దాని ఉపనదుల ద్వారా 21.50 టిఎంసిల నీటిని మిషన్ భగీరథకు ఉపయోగించాలని బృహత్ ప్రణాళికను రూపొందించారు. శ్రీశైలం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పి), కొమురం భీం ప్రాజెక్టు, పాలేరు రిజర్వాయర్, జూరాల డ్యాం, నిజాంసాగర్ ప్రాజెక్టుల నుండి తెలంగాణ వాటర్ గ్రిడ్‌కు (మిషన్ భగీరథ) నీటిని వినియోగించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రంతో పాటు ఇతర సంస్థల సాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్) ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు 2,500 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మరో 10 వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు లిఖిత పూర్వకంగా అంగీకారం తెలియచేసింది.
ఇలా ఉండగా నాబార్డ్ (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్) తొలిదశలో 1976.80 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మరో 5000 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకు ఇప్పటికే నిధులు అందించిన ‘జపాన్ ఇంటర్నేషనల్ కార్పోరేషన్ ఏజన్సీ’ (జైకా) నుండి కూడా మిషన్ భగీరథ కోసం రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగానే అధికారుల ఢిల్లీ పర్యటన జరుగుతోంది.