తెలంగాణ

ఉన్నత విద్యాసంస్థలపై గుత్త్ధాపత్యం తగ్గాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: ఉన్నత విద్యాసంస్థలపై నియంత్రణా సంస్థల గుత్త్ధాపత్యం తగ్గించాలని, అపుడే నిర్ధేశించుకున్న ఉన్నత విద్యావ్యాప్తి సాధ్యపడుతుందని భారతీయ విశ్వవిద్యాలయాల సమాఖ్య సెక్రటరీ జనరల్, రాజస్థాన్ విశ్వవిద్యాలయ మాజీ వీసీ ప్రొఫెసర్ పుర్ఖాన్ ఖమర్ పేర్కొన్నారు. భారతదేశంలో దూర విద్య పితామహుడు ప్రొఫెసర్ జీ రాం రెడ్డి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రొఫెసర్ ఖమర్ రెగ్యులేటరీ రిఫార్మ్సు ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు. నాణ్యతను విద్యార్థులకు సాంకేతిక టెక్నాలజీ అంశాలపై కోర్సులను అందించాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉంటుందని అన్నారు. నియంత్రణ విధానం కూడా శాస్ర్తియంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఓపెన్ వర్శిటీ వీసీ ప్రొఫెసర్ కే సీతారామారావు మాట్లాడుతూ దేశంలో దూర విద్యావిధానాన్ని ప్రవేశపెట్టి, లక్షలాది మంది విద్యార్ధులు ఉన్నత విద్యను అభ్యసించేలా నిర్ణయాలు తీసుకున్న ప్రొఫెసర్ జీ రాంరెడ్డి గొప్ప దార్శనీకుడని అన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జీ హరగోపాల్ మాట్లాడుతూ రాంరెడ్డి సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువపరిశోధకులకు ట్రస్టు ద్వారా అవార్డులను అందిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీ వెంకటయ్య మాట్లాడుతూ దూరవిద్య వల్ల దేశంలో లక్షలాది మందికి ఉద్యోగాలు, పదోన్నతులు కలిగాయని పేర్కొన్నారు. అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏ సుధాకర్ , మాజీ వీసీ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్, ప్రొఫెసర్ రాం రెడ్డి సతీమణి ప్రమీలా రాంరెడ్డి, ట్రస్టు సభ్యులు, మాజీ డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.